గిరిజనులు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇవ్వాలి


Sun,September 23, 2018 11:17 PM

-తాండూరు భూకైలాస్ దేవస్థానం చైర్మన్ వాసునాయక్
బొంరాస్‌పేట : వచ్చే ఎన్నికలలో మండలంలోని గిరిజనులు టీఆర్‌ఎస్‌కు మద్ధతు ఇవ్వాలని, పార్టీ తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పట్నం నరేందర్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తాండూరు భూకైలాస్ దేవాలయం చైర్మన్ వాసూనాయక్ కోరారు. ఆదివారం మండలంలోని మెట్లకుంటతండా, మైసమ్మగడ్డతండా, భోజన్నగడ్డ తండా, కాకర్లగండి తండాలలో టీఆర్‌ఎస్ అభ్యర్థికి మద్దతుగా ఆయన ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల కోసం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయని వాసునాయక్ అన్నారు. గిరిజనులు కాంగ్రెస్ మాయలో పడి మోసపోరాదని సూచించారు. టీఆర్‌ఎస్ గెలిచి కేసీఆర్ మరోసారి సీఎం అయితే గిరిజనుల బతుకులు బాగుపడుతాయని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ ప్రాం తం ఎంతో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అన్నారు. ఆయన వెంట స్థానిక గిరిజన నాయకులు ఉన్నారు.

105
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...