టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం


Sun,September 23, 2018 11:17 PM

దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండలంలోని పల్లెపల్లెన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి గెలుపే లక్ష్యంగా గత వారం రోజులుగా డోర్ టూ డోర్ ప్రచా రం ఊపందుకుంది.ఆదివారం మండల కేంద్రంతో పాటు కుదురుమళ్ల, దేశాయిపల్లి, యంకి, ఇముడాపూర్, దేవర్‌ఫస్లవాద్ తండాల్లో టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ కోట్ల మహిపాల్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో అభివృద్ధి చేసిన కారు గుర్తుకే ఓట్లు వేసి టీఆర్‌ఎస్ పార్టీకి పట్టం కట్టి ఆశీర్వదీంచాలని,ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కొడంగల్ కోటపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తే కొడంగల్ రూపురేఖలు మారుస్తామని భరోసా కల్పించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలుపు అనంతరం కొడంగల్ నియోజవర్గాన్ని గతం లో ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు.కొడంగల్‌లో టీఆర్‌ఎస్ సత్తా ఏమిటో త్వరలోనే టీఆర్‌ఎస్వీ, టీఆర్‌ఎస్ సైన్యం చూపిస్తుందని తెలిపారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి తట్టబుట్ట లేకుండా సర్దుకుపోయో రోజులు చాలా దగ్గర పడ్డాయని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డికి కొడంగల్‌లో ఓటమి భయం మొదలై పాలమూరు జిల్లా జడ్చర్ల నియోజవర్గానికి రేవంత్‌రెడ్డి పారిపోతున్నడని ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి దేశం గర్వించేలా పరిపాలన చేసిన ఘనత టీఆర్‌ఎస్ పార్టీకి దక్కుతుందన్నారు.

మండలంలోని వాడవాడల్లోని ప్రతిఇంటికి వెళ్లి కారుగుర్తు ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ప్రజల వెన్నంటి ఉండే నాయకుడు పట్నం నరేందర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. తెరాస ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు వెన్నంటిగా నిలిచి వృద్ధులకు, వికలాంగులకు, గీత కార్మికులకు, ఒంటరి మహిలలకు, వితంతువులకు పెన్షన్లు, రైతులకు రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కళ్యాణలక్ష్మి, షాదీముభారక్, నిరంతర విద్యుత్ సరఫరా ఇలా అనేక పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు.గతంలో ఎన్నడు లేనంత మెజరిటీతో గెలిపించాలని అవగహన కల్పించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్వీ నాయకులు జగత్ అశోక్, టీఆర్‌ఎస్ నాయకులు మడిగే శ్రీనివాస్, మైనొద్దీన్, కాశప్ప, సంతోష్, నారాయణరెడ్డి, కిషన్‌నాయక్, పార్థసారథి, సాయిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

205
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...