గులాబీ గుబాళింపు


Fri,September 21, 2018 11:20 PM

- కొడంగల్‌లో ఊపందుకున్న కారు జోరు
- అభివృద్ధిని ఆకాంక్షిస్తూ... స్వచ్ఛందంగా పార్టీలో చేరికలు
- పార్టీలో రోజు రోజుకూ పెరుగుతున్న చేరికల సంఖ్య
- కండువాలు కప్పిన సాదరంగా ఆహ్వానిస్తున్న ప్రముఖులు
కొడంగల్, నమస్తే తెలంగాణ : కొడంగల్ నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. సీఎం కేసీఆర్ పాలనకు ప్రజలు ఆకర్శితులై స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో చేరే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతున్నది. నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల నుంచి దాదాపు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు ముఖ్య నాయకులు గులాబీ కండువాను కప్పుకున్నారు. వీరితో పాటు ఆయా గ్రామాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పార్టీలో చేరడంతో నియోజకవర్గం గులాబీ మయంగా మారుతున్నది. కొడంగల్ మండల పరిధిలోని అంగడిరైచూర్, రుద్రారం, అన్నారం, పర్సపూర్, హస్నాబాద్, ఉడిమేశ్వర్, పాతకొడంగల్ తదితర గ్రామ పంచాయతీల నుంచి దాదాపు 2000 నుంచి 2500ల మంది వరకు పార్టీలో చేరారు. అదేవిధంగా అంగడిరైచూర్‌లో మాజీ జడ్పీటీసీ, రుద్రారంలో మాజీ సర్పంచ్ దామోద్‌రెడ్డి ఆధ్వర్యంలో 500ల మంది కార్యకర్తలు చేరగా, అన్నారం సర్పంచ్ సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో 300లకు పైగా పార్టీలో చేరారు. అదేవిధంగా కొడంగల్ అప్పటి ఎంపీపీ కన్నం దయాకర్‌రెడ్డి, ప్రస్తుత వైఎస్ ఎంపీపీ నర్సింహులు, ఎంపీటీసీలు ప్రవీణ్‌కుమర్, మల్లేశం, పద్మమ్మ, జయమ్మ తదితరులు టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కార్యకర్తలు, అభిమానులు మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్‌లో చేరారు.

హస్నాబాద్‌కు చెందిన మాజీ జడ్పీ వైస్ చైర్మన్ 500ల మందికి పైగా కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆనాటి నుంచి నేటి వరకు వలసల పర్వం కొనసాగుతూ వస్తున్నది. గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక తండాలుగా ఏర్పాటు కావడంతో సీఎం కేసీఆర్ పుణ్యమాని గిరిజన ప్రాంతాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఏర్పడిందనే సంతోషంతో శుక్రవారం పర్సాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోప్యానాయక్ తండా, బాల్యానాయక్ తండా, లాల్యానాయక్ తండా, ఎక్కచెరువు తండాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు 60 మంది ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరి కండువాను కప్పుకున్నారు. బొంరాస్‌పేట మండలంలో బొం రాస్‌పేట, ఏరుపుమల్ల, మెట్లకుంట, కొత్తూర్, లింగన్‌పల్లి, కాకర్లగడ్డ తండా, ఇప్పపల్లి, దుద్యాల్, అల్లిఖాన్‌పల్లి, రేగడిమైలా రం, నాగిరెడ్డిపల్లి, వడిచెర్ల, మహంతీపూర్, సాలిండాపూర్ గౌ రారం, లగచెర్ల, నాందార్‌పూర్ తదితర గ్రామాల నుంచి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులతో పాటు కార్యక్తలు దాదాపు 3000 మందికి పైగా టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దౌల్తాబాద్ మండలంలోని దేవర్‌ఫసల్‌వాద్, యాంకి, సంగాయిపల్లి, కుదురుమల్ల, సుల్తాన్‌పూర్, మాటూర్, నీటూర్, ఇండాపూర్, పొల్కంపల్లి, గుండెపల్లి, అల్తాపూర్, బిచ్చాల్, చంద్రకల్, నందారం, ఈర్లపల్లి, చెల్లాపూర్, సలీంపూర్, సురాయిపల్లి, గోకాఫసల్‌వాద్ తదితర గ్రామాల నుంచి టీడీపీతో పాటు కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు 2500ల వరకు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. దాంతో పాటు కోస్గి మండల పరిధి లో 1500, మద్దూర్ మండల పరిధిలో 2000ల వరకు ముఖ్య నాయకులు, కార్యకర్తలు చేరారు.

ఆకర్శిస్తున్న సంక్షేమ పథకాలు...
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల అభివృద్ధికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్శిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారాలంటే కేసీఆర్‌తో సాధ్యపడుతుందనే కృత సంకల్పంతో పార్టీలో చేరేందుకు ఆసక్తిని కనబరుస్తున్నట్లు పేర్కొంటున్నారు. 60 ఏండ్లుగా తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నాయకులు పాలనలో దోచుకోబడిందని, దీంతో అభివృద్ధి కుంటుపడి వలస జీవులుగా మారిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు. కాగా టీఆర్‌ఎస్ పాలన కొనసాగిన నాలుగున్నర కాలంలో రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే ప్రముఖ స్థానాన్ని సంపాదించుకొని అన్ని రాష్ర్టాలకు బ్రాండ్ అంబాసిటర్‌గా వెలుగొంతుందని పేర్కొంటున్నారు. దీనంతటికీ కారణం సీఎం కేసీఆర్ కాబట్టి వచ్చే ఐదేండ్లు కూడా ఆయన పాలన కొనసాగితే రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనే ఆకాంక్షతో పార్టీలో చేరిక జోరు కొనసాగుతుందని తెలుపుతున్నారు.

చరిత్రను సృష్టించే పథకాలు...
మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సలక జనుల సర్వే, భూ ప్రక్షాళన, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు చరిత్రను సృష్టిస్తున్నాయని, సీఎం అమలు పరిచిన పథకాలను ఇతర రాష్ర్టాలు పరిశీలించి అనుసరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో అన్నింటా వెనుకబడ్డ తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి ఓ తలమానికంగా మరడం కేసీఆర్‌కే సాధ్యపడిందని పేర్కొంటున్నారు.

కొనసాగుతున్న వలసలు...
తెలంగాణలో టీడీపీ పార్టీకి మనుగడ లేదనే విషయాన్ని గ్రహించిన నాయకులు, కార్యక్తలు చాలా వరకు టీఆర్‌ఎస్ పార్టీ లో చేరడంతో నియోజకవర్గంలో చాలా వరకు టీడీపీ ఖాళీ కాబడింది. ఆయా ప్రాంతాల్లో కొద్ది మంది కార్యకర్తలు ఉండిపోయారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్‌రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు కొందరు కాంగ్రెస్‌లో మనుగడ ఉండదని టీఆర్‌ఎస్ వైపు మెగ్గు చూపారు. రేవంత్‌రెడ్డి టీడీపీ కార్యకర్తలను సంప్రదించకుండా కాంగ్రెస్‌లో చేరడంతో ఆయనపై ఉన్న అసంతృత్తితో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపంచుకున్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండకపోవడంతో పాటు, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా స్వలాభం కోసం పాటుపడుతుండడంతో కార్యకర్తల్లో కొంత వరకు అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఇమడ లేక టీఆర్‌ఎస్ వైపు ఆసక్తిని కనబరుస్తున్నారు. దీంతో నియోజకవర్గ పరిధలో గులాబీ జెండా రెపరెపలాడుతూ, కారు జోరు కొనసాగుతున్నది. కొనసాగుతున్న వలసలతో ఈ సారి కొడంగల్‌లో గులాబీ జెండా ఎగురడం ఖాయని విష్లేశకులు, విద్యావంతులు పేర్కొంటున్నారు.

పార్టీలో పలువురి చేరిక
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధిలో ముం దుకు సాగుతున్నదని, సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు ఆకర్శితులై తామంతా పార్టీలో చేరుతున్నట్లు గోప్యానాయక్ తండా, బాల్యనాయక్ తండా, లాల్యనాయక్ తండా, ఎక్క చెరువు తండా వాసులు తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్‌ఎస్ నాయకులు దత్తునాయక్, కృష్ణనాయక్, అంజద్‌ల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ వెంకట్‌రెడ్డిల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఏండ్ల కాలంగా తండాలు అభివృద్ధికి నోచుకోలేక పోయాయని, సీఎం కేసీఆర్ 500ల జనాభా గల తండాలను ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయడం హర్షించ దగ్గ విషయంగా పేర్కొన్నారు. దీంతో తండాలు అభివృద్ధి చెందే ఆస్కా రం ఏర్పడిందని, గిరిజనులకు అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు గాను టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి అధిక మొజారిటీతో గెలిపించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాకుండా పదవుల కోసం పాకులాడే నాయకులతో అభివృద్ధి సాధ్యపడదని గ్రహించామని, అందుకే అభివృద్ధికి పాటుపడే నాయకుడికే తమ మద్దతు పలుకుతున్నట్లు పేర్కొ న్నారు. నాలుగు తండాలకు చెందిన టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ నాయకులు రూప్లానాయక్ (మాజీ వార్డు సభ్యులు), గుండ్యానాయక్, మోహన్ (మాజీ వార్డు సభ్యు లు) రాత్యానాయక్, శంకర్, సోమ్లా, మోత్యానాయక్, రాం సింగ్, పాండు, బాల్యానాయక్‌లతో పాటు మరో 50 మంది పార్టీలో చేరారు. పార్టీలో చేరుతున్న వారిని పట్నం నరేందర్‌రెడ్డి పార్టీ కండువాను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు విష్ణువర్దన్‌రెడ్డి, మధుసూదన్‌యాదవ్, మురారి వాశిష్ట, వెంకట్‌రెడ్డి, రాములు నాయక్, జాంప్యానాయక్, నారాయన్‌నాయక్, శేవ్యనాయక్, బాలరాజు పాల్గొన్నారు.

92
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...