ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి


Fri,September 21, 2018 12:08 AM

-పౌష్టికాహారం ప్రాధాన్యతను గ్రామీణులకు తెలియజేయాలి
-కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్
మోమిన్‌పేట : మహిళలందరికీ ఓటు హక్కు కలిగి ఉండేల అవగాహన కల్పించాలని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అధికారులకు, స్వచ్ఛంద సంస్థ, మహిళా సంఘాల సభ్యులకు సూచించారు. గురువారం మం డల కేంద్రంలో మహిళా సమాఖ్య, ఐసీడీఎస్ మర్పల్లి ప్రాజెక్టు ఆధ్వర్యంలో మహిళా ఓటరు నమోదు, పోషణ్ అభియాన్ బంగారు తెలంగాణ కోసం జన చైతన్య అవగాహన కొరకు చేపట్టిన ర్యాలీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మహిళలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషించాలంటే ఓటు హక్కు తప్పకుండా కలిగి ఉండాలన్నారు. ఓటు హక్కులేని వారు ఈనెల 25వ తేదీలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. అలాగే ఓటర్‌కు సంబంధించిన వివరాలను సవరణ చేసుకోవాలని అనుకున్న వారు సవరణలు, తొలగింపులు చేసుకోవచ్చన్నారు. నూతన ఓటరు నమోదు, ఓటర్ల సవరణలు చేసుకోదలచిన వారు గ్రామాలలో బూత్ స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మండల తహసీల్దార్ కార్యాలయాలలో ఓటరు నమో దు దరఖాస్తులు తీసుకొవడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్టు ఆయన తెలియజేశారు. పౌష్టికాహారం విలువల ప్రాధాన్యతను గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ అంగన్‌వాడీ కార్యకర్తలకు సూచించారు. ప్రకృతి పరంగా సీజన్లలో లభించే పోషక విలువలు గల వాటి పట్ల అవగాహన కల్పించాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోష్టిక విలువలు గల ఆహారాన్ని కిశోర్ బాలికలకు గర్భిణి మహిళలకు సక్రమంగా అందించి వాటివల్ల కలిగే లాభాలను వివరించాలన్నారు. తహసీల్దార్ ఎస్. రవీందర్ ఎంపీడీవో శైలజారెడ్డి ఐసీడీఎస్ సీడీపీవో కృష్ణవేణి ఎంపీఎం ఆనంద్ అంగన్‌వాడీ, మహిళా సమాఖ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి: కలెక్టర్
మర్పల్లి : 18 ఏండ్లు నిండిన యువతీ, యువకులకు ఓటు హక్కు నమోదు అవగాహన కల్పించాలని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ మహిళ సంఘాల సభ్యులకు సూచించారు. గురువారం మండల కేంద్రంలోని ఇందిర క్రాంతి భవనంలో ఓటు హక్కు నమోదుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రతి గ్రామంలో తిరుగుతూ ఓటు హక్కుపై అవగాహన కల్పించే విధంగా చూడాలన్నారు. మహిళ సంఘాల సభ్యులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరుపుకుంటున్నారని మహిళలకు అడిగి తెలుసుకున్నారు. రుణాలు తీసుకున్న మహిళలు యూనిట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య మహిళ అధ్యక్షురాలు ఇందిరా, ఐకేపీ ఏపీఎం మధుకర్, సిబ్బంది పోచయ్య, నవీన్ పాల్గొన్నారు.

మహిళలు ఓటు హక్కుపై అవగాహన పెంచుకోవాలి
కొడంగల్, నమస్తే తెలంగాణ : మహిళలు ఓటు హక్కుపై పూర్తి అవగాహన పెంచుకోవాలని, 18 ఏండ్లు నిండిన తమ పిల్లలకు ఓటు హక్కును కల్పించే బాధ్యను తీసుకోవాలని జేసీ అరుణకుమారి సూచించారు. గురువారం మహిళా ఓటు అవగాహన సందర్భంగా కొడంగల్ తహసీల్దార్ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు చనిపోయి ఉంటే ఆ కు టుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరణ ధ్రువీకరణ పత్రం చూపించి ఓటు హక్కును జాబితా నుంచి తొలిగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దాంతో పాటు శాశ్వతంగా గ్రామాన్ని వదిలి ఇతర గ్రామాలకు వలసవెళితే వారి ఓటును జాబితానుంచి తొలిగించేవిధంగా అధికారులు, కుటుంబసభ్యులు చొరువ తీసుకోవాలని సూచించారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 25లోపు కొత్త వారు దరఖాస్తులు చేసుకోవడం, చనిపోతే, శాశ్వతంగా గ్రామాన్ని వదిలి ఉంటే ఓటరు జాబితా నుంచి తొలిగించుకోవాలని, అక్టోబర్ 8లోపు మార్పులు చేర్పులు చేపట్టిన తరువాత తుది ఓటరు జాబితాను విడుదల చేసే ప్రణాళిక ఉన్నట్లు తెలిపారు. కాగా 25 వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుండటంవల్ల ఓటర్లు పెరిగే అవకాశం ఉందన్నారు. గత సంవత్సరంకంటే ఈసారి చనిపోయి, వలసవెళ్లిన వారి ఓట్ల తొలిగింపుతో ఓటరు సంఖ్య తగ్గిందని తెలిపారు. ఈవీఎం ఓటింగ్ పద్ధతిన అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల కారణంగా ఈసారి ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ వీవీ ప్యాడ్ పద్ధతిని కొత్తగా ప్రవేశపెట్టడం జరిగిందిని, దీని ద్వారా ఓటేసిన 7 నిమిషాలలోపు ఓట రు ఎవరికి ఓటు వేశామో సరిచూసుకునే సదుపాయాన్ని కల్పించడం జరిగిందన్నారు. మొట్టమొదటగా ఈ పద్ధతిని ప్రవేశపెడుతుండటంవల్ల ముందస్తుగా దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈవీఎం భద్రతకై స్థల పరిశీలన
ఈవీఎంల భద్రత, ఎన్నికల ప్రక్రియను కొనసాగించేందుకు గాను పట్టణంలోని మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించారు. ఈవీఎంలను భద్రపరిచేందుకు గోదాం బాగుందని,ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు గాను స్థలం పూర్తి అనువుగా ఉందన్నారు. ఖాళీ స్థలం లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే ఏర్పాటు చేయాలని తహసీల్దార్ వెంకటేశ్‌కు సూచించారు. గతంలో జూనియర్ కళాశాలలో ఎన్నికల ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, ప్రస్తుతం ఎన్నికలు జరిగే సమయంలో కళాశాలలు కొనసాగుతుండటం వల్ల విద్యార్థులకు ఇబ్బందుల ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తున్నట్లు తెలిపారు.

బతుకమ్మ చీరలు చాలా బాగున్నాయి...
దసరా ఉత్సవాల్లో భాగంగా మహిళలు నిర్వహించుకునే బతుకమ్మ వేడుక సందర్భంగా తెలంగాణ ప్రభు త్వం తెలంగాణ ఆడపడచులకు చీరలను పంపిణీ చేయనుంది. ఇందుకుగాను కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, తాండూర్, యాలాల్, బషీరాబాద్ మండలాలకు సంబంధించి మొత్తం 25వేల బతుకమ్మ చీరలు కొడంగల్ మార్కెట్ యార్డ్‌కు చేరుకోవడం జరిగింది. మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన జేసీ బతుకమ్మ చీరలను పరిశీలించి బాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. మహిళలు ఇష్టంగా కట్టుకోవడం జరుగుతుందన్నారు.

624
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...