ప్రభుత్వ దవాఖానల సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్


Fri,September 21, 2018 12:07 AM

నవాబుపేట : ప్రభుత్వ దవాఖానల్లో అందిస్తున్న అన్ని రకాల సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సయ్యద్ ఉమర్ జలీల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన ఇంటింటికీ పోషకాహారం సంబురాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పోషకాహారంపట్ల ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తోందని అన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులను ప్రోత్సహిస్తూ కేసీఆర్ కిట్లు పంపిణీ చేసి చిన్నారుల ఆరోగ్యంపట్ల అధిక ప్రాధాన్యతనిస్తున్నదని అన్నారు. చిన్నారులకు మంచి పోషక విలువలున్న ఆహారాన్ని అందించడంతో వారు సంపూర్ణమైన యువతగా తయారవుతారని, ఈ నేపథ్యంలో దేశానికి ఉపయోగపడే మంచి పౌరులవుతారని అన్నారు. ఉన్నదాంట్లో పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలన్నారు. అందుకోసం అంగన్‌వాడీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తగిన సూచనలు, సలహాలు అందించాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమనే నినాదాన్ని అలవరుచుకోవాలని, అందుకోసం పోషకాహారాన్ని విధిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. అదే విధంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు స్వచ్ఛందంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని సూ చించారు. ఎన్నికల కమిషన్ అందుకోసం తగిన విధానాలను రూపొందించిందని స్థానిక మీసేవా దారా, తహసీల్దార్ కార్యాలయం ద్వారా ఓటు హక్కు లేని వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐకేపీ సిబ్బంది ప్రోత్సహించాలని అన్నారు. ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిన ఉన్నతమైన సాధనమని అన్నారు. భారత పౌరునిగా ఓటు హక్కు కలిగి ఉండటం అనివార్యమని అన్నారు. ఈ నేపథ్యంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ పాండురంగారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో సుమిత్రమ్మ, సీడీపీవో మల్లేశ్వరమ్మ, పర్యవేక్షకురాలు మణిమాల, ఐకేపీ సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...