కేసీఆర్ పాలన చరిత్రలో పదిలం


Fri,September 21, 2018 12:07 AM

తాండూరు టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాల న చరిత్రలో పదిలమని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. తాండూరు పట్టణ సమీపంలోని ఖాంజాపూర్ గేట్ దగ్గర మంత్రి మహేందర్‌రెడ్డి సహకారంతో ఎకరా స్థలంలో రూ. 85లక్షలతో సుందరంగా నిర్మించే ఎస్సీ ఏసీ ఫంక్షన్‌హాల్‌కు గురువారం ఆమె స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సునీతారెడ్డి మాట్లాడుతూ పార్టీలు, కులమతాలకు అతీతంగా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అందిస్తున్నదని తెలిపారు. తాండూరు ప్రాంతంలో మంత్రి మహేందర్‌రెడ్డి అధిక నిధులు తీసుకొచ్చి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశారని అభిప్రాయ పడ్డారు. ప్రతి ఒక్కరూ మరుగు దొడ్డి కట్టుకోవాలని, మొక్కలను పెంచాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రూ. 85లక్షలతో ఫంక్షన్‌హాల్ నిర్మాణానికి కృషి చేసిన మంత్రి మహేందర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డితో పాటు స్థానిక నేతలకు ఎస్సీ ప్రజలు, ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌కు అండ గా ఉంటామన్నారు. కార్యక్రమంలో తాండూరు ఎంపీపీ లక్ష్మ మ్మ, జడ్పీటీసీ రవిగౌడ్, యాలాల యంపీపీ సాయన్న గౌడ్, టీఆర్‌ఎస్ నేతలు శోభారాణి, నీరజాబాల్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అమితానంద్, శేఖర్, ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి అండ
తాండూరు రూరల్ : కేసీఆర్ ప్రభుత్వం అడబిడ్డలకు కల్యానలక్ష్మి అండగా నిలుస్తున్నదని జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పేర్కొన్నారు. గురువారం తాండూరు మండలంలోని బిజ్వార్, నారాయణపూర్, గోనూరు, చెన్‌గేశ్‌పూర్, ఎల్మకన్య, కరణ్‌కోట్, బెల్కటూర్, రాంపూర్‌తండా, సంకిరెడ్డిపల్లి గ్రామాల్లో రూ, 75 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రా రంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డ పుడితే కేసీఆర్ కిట్‌తో పాటు, 13వేల ఆర్థిక సహా యం అందిస్తున్నామని తెలిపారు. అదే విధంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లక్ష16 వేల చెక్కు ను ఆర్థిక సహాయంగా ఇస్తుందన్నారు. తాండూరు నియోజక వర్గ అభివృద్ధికి రూ. 30 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆధిక మేజర్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. జడ్పీటీసీ రవిగౌడ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే టీఆర్‌ఎస్ పార్టీని గెలిపించేందుకు దోహదపడుతాయని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎమ్మెల్యే ఎన్నికల్లో మంత్రిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధమని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కొస్గి లక్ష్మమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, వైస్ ఎంపీపీ శేఖర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాంలింగారెడ్డి, పార్టీ అధ్యక్షులు రాందాస్, మాజీ సర్పంచ్ కేశవరావు, మాజీ ఉప సర్పంచ్ అమృత్‌రెడ్డి, డీఈ వెంకటేశ్వర్లు, ఎంపీడీవో జగన్‌మోహన్‌రావు, శకుంతల, ఎంపీటీసీ వసంత్‌కుమార్, శోభ, హేమంత్‌కుమార్, పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

సాయిపూర్ వాసులను కలిసిన జడ్పీ చైర్‌పర్సన్
తాండూరు, నమస్తే తెలంగాణ : తాండూరు పట్టణంలోని సాయిపూర్‌లో జడ్పీ చైర్‌పర్సన్ సునీతామహేందర్‌రెడ్డి గురువారం రాత్రి 8 గంటల సమయంలో పలువురు ప్రముఖులను కలిసి వారితో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించేందుకు సహకరించాలని కోరారు. తాండూరు పట్టణంలో రోడ్ల అభివృద్ధికి ప్రభు త్వం గత నాలుగున్నరేండ్ల్లలో రూ. 200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. తాండూరు పట్టణం చుట్టూ రూ. 100 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మించనున్నట్లు తెలిపారు. బైపాస్ నిర్మాణంలో భూములు కోల్పోయిన సాయిపూర్ వాసులకు పునరావాసం కోసం ఆశించిన రీతిలో తగు సనష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. రూ. 28కోట్ల వరకు నిధులు వెచ్చించినట్లు తెలిపారు. కాగా సాయిపూర్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకులు సాగర్‌గౌడ్ రోడ్డు ప్రమాదానికి గురవడంతో ఆయనను జడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి పరామర్శించారు. జడ్పీచైర్‌పర్సన్‌తో పాటు తాండూరు జడ్పీటీసీ రవీందర్‌గౌడ్, మాజీ ఎంపీపీ రామలింగారెడ్డి, శెట్టిఅమితానంద్, టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకురాలు శకుంతల, నర్మదారెడ్డి ఉన్నారు.

114
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...