కంటి వెలుగు శిబిరానికి మంచి స్పందన


Wed,September 19, 2018 11:06 PM

-కులకచర్ల ప్రభుత్వ దవాఖానలో 89మందికి కంటి పరీక్షలు
-బొంరెడ్డిపల్లిలో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరం
కులకచర్ల : కంటి వెలుగు శిబిరానికి మంచి స్పందన లభిస్తున్నది. కులకచర్ల ప్రభుత్వ దవాఖా నలో బుధవారం ఆప్తాల్మిక్ అధికారి డాక్టర్ జవహార్‌లాల్ నిర్వహించిన కంటి వైద్యశిబిరానికి 89మందికి పరీక్షలు చేయించుకోగా, అందులో 72మంది కంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అందు లో 39మందిని మహబూబ్‌నగర్‌లోని రాంరెడ్డి లయన్స్ క్లబ్‌కు తరలించారు. మిగతా వారికి ఆపరేషన్ల కోసం శుక్రవారం సమయం ఇచ్చారు. అవసరమున్నవారికి కంటి చుక్కలు వేయడంతో పాటు మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మురళీకృష్ణ, ఫార్మాసిస్ట్ మల్లేశ్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బొంరెడ్డిపల్లి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యులు ప్రారంభించారు. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు సూచించారు.

సద్వినియోగం చేసుకోవాలి
పరిగి రూరల్ : కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల్ వైద్యులు పరీక్షిత్, చిట్యాల్ ప్రత్యేక అధికారి వెంకట్‌లు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని చిట్యాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి సంబంధ సమస్యలుంటే వైద్యం చేయించుకోవాలని, అవసరమైన వారికి ఉచితంగా కంటి ఆపరేషన్‌లు నిర్వహించి, కళ్లద్దాలు అందజేస్తున్నట్లు తెలిపారు. కండ్లను కాపాడుకునే జాగ్రత్తల గురించి వైద్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు శ్రీలత, జవహర్, వైద్య సిబ్బంది రాఘవేందర్, రమేశ్, సీఆర్‌పీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...