వెలుగులు నింపుతున్న కంటి వెలుగు


Wed,September 19, 2018 11:05 PM

-నెల రోజుల్లో 3,738 మందికి పరీక్షలు
-68 మందికి శస్త్ర చికిత్సలకు రెఫర్, 654 మందికి కంటి అద్దాల పంపిణీ
కొడంగల్, నమస్తే తెలంగాణ : కంటి వెలుగు కార్యక్రమం గ్రామీణ ప్రాంత వాసుల్లో వెలుగును నింపుతున్నదని ప్రజలు కొనియాడుతున్నారు. గతంలో గ్రామీణ ప్రజలు కంటి సమస్యలపై అంతగా ఆసక్తిగానీ, పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన అంతగా ఉండేది కాదని, కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కంటి వెలుగు కార్యక్రమంతో గత నెల రోజుల నుంచి గ్రామాల్లో వెలుగును నింపుతుందని ప్రజలు పేర్కొంటున్నారు. గ్రామాలకే వైద్యులు తరలి వచ్చి కంటి సమస్యలపై పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి శస్త్రచికిత్సలు, కంటి అద్దాలు అందించడంతోపాటు మం దులు అందిస్తుండటం హర్షించదగ్గ విషయంగా పేర్కొంటున్నారు.పంద్రా గస్టునుంచి ప్రారంభమైన కంటి వెలుగు కార్యక్రమంలో మండల పరిధిలో గత నెల రోజుల కార్యక్రమంలో హస్నాబాద్‌లో పూర్తికాగా, ప్రస్తుతం గత నాలుగు రోజులుగా అంగడిరైచూర్ గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్నది. మరో పది రోజులు ఈ గ్రామంలోనే కార్యక్రమం కొనసాగనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

ఈ కార్యక్రమం వృద్ధులకు మంచి చేయూతను అందిస్తున్నదని, కంటి చూపు మసక లేదా పూర్తిగా మందగిస్తేనే గ్రామస్తులు కంటి సమస్య ఉన్నట్లు గుర్తించేవారని కానీ నేటి కంటి వెలుగు కార్యక్రమంతో కొద్దిపాటి దృష్టి లోపాన్ని పరీక్షంచుకొని కంటిని కాపాడుకోవడం జరుగుతున్నదని వృద్ధులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇటువంటి ఆలోచన ఏ ప్రభుత్వానికి రాలేదని, సీఎం కేసీఆర్ పుణ్యమాని కంటి చూపును కాపాడుకునే అదృష్టం ఏర్పడిందని వృద్ధులు కొనియాడుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఇప్పటివరకు హస్నాబాద్, అంగడిరైచూర్ గ్రామాల్లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలో మొత్తం 3738 మంది కంటి పరీక్షలను చేయించుకోగా, ఇందులో 68 మందికి శస్త్రచికిత్సలకు హైదరాబాద్‌కు పంపించడం, 410 మందికి రెండు చూపుల అద్దాలను రెఫర్ చేయడం, 654 మందికి కంటి అద్దాలను అందించినట్లు క్యాంపు అధికారులు తెలుపుతున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారి డా.రేఖ, క్యాంపు అధికారి డా.గౌతంరాజ్, ఆఫ్తాల్మిక్ వైద్యులు హరినాథ్‌నెహ్రూ, సీహెచ్‌వో సుశీల, పీహెచ్‌ఎన్ విజయరాణి, క్యాంపు కోఆర్డినేటర్ మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

136
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...