సీసీ రోడ్లు ప్రారంభం


Wed,September 19, 2018 11:05 PM

పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి జరిగిందని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గాజీపూర్, జనగాం, తట్టెపల్లి గ్రామాల్లో ఎంపీ పర్యటించి పలు సీసీ రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మండల పరిధిలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్, ఎంపీ నిధుల నుంచి జనగాంలో రూ. 5 లక్షలు, గాజీపూర్‌లో రూ.6 లక్షలతో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించి, తట్టేపల్లిలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డును వేయడానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హ యాంలోనే దాదాపు అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో మౌలిక కలుపన సదుపాయాలను కల్పి ంచడం కోసం ప్రభుత్వం కొన్ని కోట్ల నిధులను ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామ ంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మంచి నీటి సరఫరా కొరకు అధిక ప్రాధాన్యత నిచ్చి నిధులను మంజూరు చే యడం జరిగిందన్నారు. కేవలం తెలంగాణ ప్రభుత్వంతోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో నాయకులు పాం డు, మండల ఇన్‌చార్జి ఎంపీడీవో జర్నప్ప, పంచాయత్ రాజ్ డిఫ్యూటీ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, గ్రా మాల్లోని నాయకులు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...