మంజూరైన నిధులు.. ముమ్మరంగా పనులు


Wed,September 19, 2018 11:05 PM

-ఏళ్ల నాటి కల...తీరుతున్న వేళ
-ప్రారంభమైన బీటీ రోడ్డు పనులు
-ఆనందంలో కొండారెడ్డిపల్లి గ్రామస్తులు
కొడంగల్, నమస్తే తెలంగాణ : నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా ఉండిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. రోడ్డు సౌకర్యాలు లేక ప్రజలు ఏండ్ల కాలంగా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం పుణ్యమాని నేడు గ్రామానికి బీటీ రోడ్డు మంజూరు కావడంతో పాటు పనులు కొనసాగుతుండటం చాలా సంతోషంగా ఉందంటున్నారు. మే నెలలో మంత్రి మహేందర్‌రెడ్డి చేతుల మీదుగా రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగి నాలుగు నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడంవల్ల కొంత ఆందోళన చెందాల్సి వచ్చిందని, కానీ ప్రస్తుతం పనులు కొనసాగుతుండటంతో త్వరలో గ్రామానికి బీటీ రోడ్డు సౌకర్యాలు చేకూరుతాయనే ఆశ చిగురించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అప్పట్లో గ్రామ సమస్యను పట్టించుకునే వారు లేకపోవడంతో గ్రామస్తు లంతా ఏకమై స్వచ్ఛందంగా చందాలు పోగుచేసుకొని శ్రమదానంతో పాటు జేసీబీ సహాయంతో రోడ్డు పక్కన గల ముళ్లపొదలను తొలగించి రోడ్డు పనులను చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గమనించి బీటీ రోడ్లను మంజూరు చేయడంతో గ్రా మాలకు ప్రాణం వచ్చినట్లుగా అయిందని గ్రామవాసులు పేర్కొంటున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్డు సౌకర్యాలను కల్పించేందుకు రూ.59.66 కోట్ల మంజూరు చేసింది. ఇందులో భాగంగా కొండారెడ్డి గ్రామ బీటీ రోడ్డుకు రూ.కోటీ 70లక్షలు మంజూరు కాగా గత మే నెల 1వ తేదీన మంత్రి మహేందర్‌రెడ్డి బీటీ రోడ్డు పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేపట్టారు. నేడు తెలంగాణ ప్రభుత్వం కోరగానే రూ.కోటీ 70లక్షలు మంజూరు చేసి బీటీ రోడ్డు సౌకర్యాన్ని కల్పించడం చాలా సంతోషంగా ఉందని సీఎం కేసీఆర్‌కు గ్రామ ప్రజలు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...