సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి పెట్టాలి


Wed,September 19, 2018 11:04 PM

బొంరాస్‌పేట : మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు దృష్టి పెట్టాలని ఎంపీపీ మంగమ్మ, జడ్పీటీసీ జ్యోతిరెడ్డి అన్నారు. బుధవారం జరిగిన మండల సమావేశంలో వారు మాట్లాడారు. రైతుబంధు పథకంలో కొంతమంది రైతులకు ఇంకా పాసు పుస్తకాలు రాలేదని, వారందరికీ బుక్కులతో పాటు చెక్కులు అందేలా చూడాలని సభ్యులు కోరారు. పాఠశాలల్లో నిర్మించే మూత్రశాలలు చిన్నవిగా ఉండడంవల్ల విద్యార్థులకు సరిపోవడం లేదని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నిర్మించాలని బొంరాస్‌పేట ప్రత్యేకాధికారి హెచ్‌ఎం పాపిరెడ్డి కోరారు. ఇంకా సమావేశంలో వివిధ అంశాలపై సభ్యులు అధికారులను ప్రశ్నలు అడిగారు. సమావేశానికి అధికారులు తక్కువ సంఖ్యలో హాజరుకావడంతో సమావేశం చప్పగా ముగిసింది. ఎంపీడీవో హరినందనరావు, తహసీల్దార్ విద్యాసాగర్‌రెడ్డి, అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...