రుద్రారంలో ఘనంగా మొహర్రం


Wed,September 19, 2018 11:04 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ: మండలంలోని రుద్రారం గ్రామంలో మొహర్రం పండుగలో భాగంగా 7 రోజుల వేడుకను బుధవారం గ్రామస్తులు కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పెద్ద మసీదు ప్రాంతంలో ఏర్పాటైన ఇమామ్‌ఖాసీం పీర్లను గత ఏడు రోజులుగా భక్తుల పూజలందుకొని 7వ రోజు నిమజ్జన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇమాంఖాసీంకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులను తీర్చుకున్నారు. అనంతరం గ్రామానికి చెందిన ఖాజామియా ఆల్లా భక్తులో సవారి నిండి ఇమాంఖాసీంలను ధరించి గ్రామంలో ఉరేగింపుగా బయలుదేరి భక్తులకు దర్శనాన్ని అందించారు. గ్రామ వీధుల్లో దారి పొడవునా ఇమాంఖాసీంకు భక్తులు పాత్యాలను అందించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.

231
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...