రుణాలను సద్వినియోగం చేసుకోండి


Wed,September 19, 2018 11:04 PM

కొడంగల్, నమస్తే తెలంగాణ : నిరుద్యోగులకు ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని బీసీ వెల్ఫేర్ అధికారి సతీశ్, మాజీ జడ్పీటసీ ఏన్గుల భాస్కర్, ఎంటీసీ నందారం రాజేందర్, ఎంపీడీవో శ్యాంసుందర్ పేర్కొన్నారు. బుధవారం బీసీ కార్పొరేషన్‌ద్వారా మంజూరైన రుణాలను లబ్దిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ ద్వారా కేటగిరీల వారీగా రుణాలకోసం లబ్ధిదారులు దరఖాస్తులు అందించారని, మొదటగా కేటగిరీ 1 కింద చిరు వ్యాపారాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సబ్సిడీ నగదు రూ.50వేలను చెక్కుల రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్, డీఆర్‌డీఏ, జేసీ, బీసీ కార్పొరేషన్ సమక్షంలో కేటగిరీల వారీగా డిప్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు తెలిపారు.

మొత్తం 85వరకు దరఖాస్తులు అందించడం జరిగిందని, వీరిలో మొత్తం 19 మందిని ఎంపిక చేసి బ్యాంకు రుణంతో సంబంధం లేకుండా నయా పైసా చెల్లించని విధంగా 100శాతం సబ్సిడీతో లక్ష రూపాయల రుణానికి గాను రూ.50వేల చెక్కులను అందిస్తున్నట్లు తెలిపారు. 85 మందిలో 19 మంది అదృష్టాన్ని పరీక్షంచుకోవడం జరిగిందని, రుణాన్ని సద్వినియోగం చేసుకొని ఆదర్శంగా నిలువాలని కోరారు. అదేవిధంగా నాయిని, కుమ్మరి తదితర వర్గాల వారు రుణాలు పొందేందుకు గాను వారివారి ఫెడరేషన్లకు సంబంధించి ఎండీల పేరుమీద రూ.165ల డీడీని అందించాలని సూచించారు. కొంత మందికి రుణాలు మంజూరు కాలేదని నిరాశ పడాల్సిన అవసరం లేదని కేటగిరీల వారిగా రుణాలు పంపిణీ కాబడుతున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో లబ్ధిదారులు పాల్గొన్నారు.

77
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...