శాంతి కమిటీ సమావేశం


Wed,September 19, 2018 11:04 PM

మోమిన్‌పేట: పండుగలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మోమిన్‌పేట సీఐ బి.శ్రీనివాస్ అన్నారు. బుధవారం మోమిన్‌పేట పోలీస్‌స్టేషన్ ఆవరణలో శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ఎలాంటి అల్లర్లకు తావివ్వొద్దన్నారు. ఇతరులకు ఇబ్బందులు సృష్టించొద్దన్నారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. అన్నివర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రషీద్ వివిధ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

కోట్‌పల్లి: కోట్‌పల్లి పంచాయతీ కార్యాలయంలో వివిధ మత పెద్దలతో ఎస్‌ఐ ఏడుకొండలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జనం, మొహర్రం పండుగలు ఒకేరోజు ఉన్నాయని, శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించరాదన్నారు. సాయంత్రంలోగా నిమజ్జనం అయ్యేలా చూసుకోవాలన్నారు. మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, మండప నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...