ఊరూరా గులాబీ జెండా ఆవిష్కరణ


Wed,September 19, 2018 11:04 PM

పూడూరు :పరిగి నియోజకవర్గంలోని ఊ రూరా గులాబీ జెండాల ఆవిష్కరణ కార్యక్రమా న్ని నిర్వహించనున్నట్లు టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కె.అనిల్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మం డల పరిధిలోని సమావేశ ముగింపు సందర్భం గా ఆయన మాట్లాడుతూ, పరిగి నియోజకవర్గం లో హరీశ్వర్‌రెడ్డి చేపట్టిన పనులే నేటికీ దర్శనమిస్తున్నాయని పే ర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసింది గోరంత, చెప్పుకునేది కొండంతగా ఉందని విమర్శించారు. పరిగినియోజకవర్గంలోని యువజన సంఘాల నా యకులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న మహేశ్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి రాష్ట్ర ముఖ్యమంత్రికి కానుకగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండలఅధ్యక్షుడు మల్లేశం, మాజీ అధ్యక్షుడు అజీం, సర్పంచ్‌ల సంఘం మండల మాజీ అధ్యక్షుడు మధు, రఘు, ఆయా గ్రామాల యు వజన సంఘాల నాయకులు ఉన్నారు.

76
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...