మా ఓటు టీఆర్‌ఎస్‌కే


Tue,September 18, 2018 11:29 PM

-సీఎం కేసీఆర్‌కే తమ మద్దతంటున్న వృద్ధులు, వికలాంగులు
-ముఖ్యమంత్రి పింఛన్ ఇచ్చి ఆదుకుంటుండంటున్న లబ్ధిదారులు
-జిల్లాలో ప్రతినెలా పింఛన్ల కోసం రూ.12 కోట్లు
-నాలుగేండ్లలో రూ. 576 కోట్ల వ్యయం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:వృద్ధులు, వికలాంగులు టీఆర్‌ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. కనిపెంచిన బిడ్డలు సైతం తమను పట్టించుకోవడంలేదని.. సీఎం కేసీఆర్ కన్నబిడ్డలెక్క నెలకు వెయ్యి, పదిహేను వందలు పింఛన్ ఇస్తున్నాడని, తమ ఓటు కారుగుర్తుకేనని స్పష్టం చేస్తున్నారు. గతంలో ఇచ్చే రూ. 500లకే అధికారులు తిప్పించుకునేవారని, ఇప్పుడు నెలనెలా డబ్బులు ఠంచనుగా అందుతున్నాయని అంటున్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలని, తామంతా టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కాగా జిల్లాలో ప్రతినెలా ఆసరా పింఛన్ల కోసం ప్రభుత్వం రూ. 12 కోట్లను ఖర్చు చేస్తుండగా.. ఈ నాలుగేండ్లలో రూ. 576 కోట్ల పింఛన్ డబ్బులు లబ్ధిదారులకు పంపిణీ చేసింది.

ఈయన పేరు సంగపు వెంకటయ్య. వికారాబాద్ మండలం గిరిగెట్‌పల్లి గ్రామ వాసి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా, సంబంధిత కార్యాలయాలకు ప్రదక్షిణలు చేసినా పింఛన్ డబ్బులు రాలేదు. కుటుంబ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండడంతో ఎంతో కష్టంగా పూట గడుపాల్సిన పరిస్థితి ఉండేది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మా జీవితాల్లో వెలుగులు నిండాయంటున్నారు. కూలీనాలీ చేసి పూట గడుపుతున్న తమకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1500 పింఛన్ ఇస్తున్నారు. పింఛన్ డబ్బులు పెంచుతూ నిర్ణయించిన కేసీఆర్ సార్‌తోనే తాను, తనలాంటి వాళ్లెంతో మంది గౌరవంగా బతుకుతున్నామంటున్నారు. రూ.1500లకు పింఛన్ డబ్బు పెంపుతో మా బతుకులు బాగుపడడంతో పాటు మరొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేదు. మేం బతికినంతా కాలం కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి, లేదంటే మాలాంటి వారికి పింఛన్ డబ్బులు కూడా అందని పరిస్థితి వస్తుంది. మా ఊర్లోని పింఛన్‌దారులమంతా ఏకమై టీఆర్‌ఎస్ పార్టీనే గెలిపించుకుంటాం.

ఒక్క వెంకటయ్యే కాదు, ఆసరా పింఛన్లు పొందుతున్న ప్రతి పింఛన్‌దారులు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జై కొడుతున్నారు. అదే గ్రామానికి చెందిన ఘణపురం నర్సింహులు అనే పింఛన్‌దారుడు పేద వయోవృద్ధులకు కేసీఆర్ దేవుడంటున్నారు. తెలంగాణ సంపూర్ణ అభివృద్ధి చెందాలన్నా, సబ్బండ వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ సార్‌నే అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరముందంటున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా, పేద ప్రజల బతుకుల్లో ఎలాంటి మార్పుండేది కాదు, టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఆసరా పింఛన్‌దారులే కాకుండా అన్నివర్గాల ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌తోనే పేదల అభివృద్ధి సాధ్యమంటున్నారు గిరిగెట్‌పల్లి గ్రామానికి చెందిన ఆసరా పింఛన్‌దారులు. ఇలా ఈ ఒక్క గ్రామానికి చెందిన పింఛన్‌దారులే కాదు, జిల్లాలోని పింఛన్‌దారులందరూ ముక్తకంఠంతో ఒకటే మాట చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించుకుంటామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌కు జై కొడుతున్నారు.

నాలుగేండ్లలో రూ.576 కోట్లు
ఏ దిక్కూ లేని పేద ప్రజలను ఆసరా పథకంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తుంది. ఎన్నికలకు ముందు పింఛన్లను పెంచుతామని ఇచ్చిన హామీ మేరకు ఆసరా పథకాన్ని ప్రవేశపెట్ట్టి మేమున్నామంటూ సీఎం కేసీఆర్ పింఛన్లను భారీగా పెంచారు. ఎవరూ ఊహించని విధంగా వికలాంగుల, వృద్ధాప్య ఇతర పింఛన్లను పెంచి తోడులేని వృద్ధులు, నిరుపేదలకు బతుకుపై భరోసా కల్పించారు. ఏ ఆసరా లేని వారిని ఆదుకునేందుకుగాను టీఆర్‌ఎస్ సర్కార్ 2014 నవంబర్‌లో ఆసరా పథకాన్ని తీసుకువచ్చింది. ఈ నాలుగేళ్లలో ఆసరా పథకం ద్వారా జిల్లాలో రూ.576 కోట్లను పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం వెచ్చించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా జిల్లాలో నెలకు రూ.12 కోట్లను పింఛన్ల నిమిత్తం ఖర్చు చేస్తుంది. గత ప్రభుత్వాల హయాంలో పింఛన్ల నిమిత్తం నెలకు కేవలం రూ.2 కోట్లను మాత్రమే పంపిణీ చేసేవారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం పింఛన్లు కూడా అధిక మొత్తంలో పెరిగాయి. గతంలో వికలాంగులకు ఇచ్చిన రూ.500 పింఛన్‌ను రూ.1500, వృద్ధులకు, గీత కార్మికులకు, వితంతువులకు ఇచ్చే పింఛన్ రూ.200 నుంచి రూ.వెయ్యికి పెంచింది. బీడీ కార్మికులకూ కూడా రూ.వెయ్యి పింఛన్‌ను అందజేస్తుంది.

జిల్లావ్యాప్తంగా 1,05,154 ఆసరా పింఛన్లు ఉండగా, వీటిలో వృద్ధాప్య పింఛన్లు 37,893, వితంతు పింఛన్లు 49,070 పింఛన్లు, వికలాంగులు 12,856 మంది పింఛన్‌దారులు, గీత కార్మికులు 479 పింఛన్‌దారులు, చేనేత కార్మికులు 169 మంది పింఛన్‌దారులు, 43 మంది బీడీ కార్మికులు ఉన్నారు. జిల్లాలో నెలకు రూ.12 కోట్ల మేర పింఛన్లను పింఛన్‌దారులకు బ్యాంకుల ద్వారా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో పింఛన్ డబ్బును జమ చేస్తున్నారు. ఒంటరి మహిళలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఏ దిక్కులేని మహిళలకు రూ.వెయ్యి పింఛన్‌ను అందిస్తూ ఒంటరి మహిళల జీవితాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భరోసానిచ్చారు. భర్త వదిలేసిన, విడాకులు తీసుకున్న వారు, పెళ్లికాకుండా ఉన్నవారు, మానసిక స్థితి సరిగ్గాలేని వారు, కుటుంబసభ్యుల్ని కోల్పోయిన ఒంటరి మహిళలను ఆర్థిక ఆదుకునేందుకు గాను సీఎం కేసీఆర్ రూ.వెయ్యి పింఛన్‌ను అందజేస్తున్నారు. ఒంటరి మహిళలకు రూ.వెయ్యి పింఛన్‌ను అందించాలని తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోని 4,645 మంది లబ్ధి పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు ఒంటరి మహిళలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు తీసుకున్న నిర్ణయంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా 1,05,154 ఆసరా పింఛన్లు
జిల్లావ్యాప్తంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ, బీడీ, ఒంటరి మహిళల పింఛన్‌దారులు 1,05,154 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో మండలాల వారీగా పింఛన్‌దారులను పరిశీలిస్తే బంట్వారం మండలంలో 2553 పింఛన్‌దారులు, బషీరాబాద్ మండలంలో 5141 పింఛన్‌దారులు, బొంరాస్‌పేట్‌లో 5860 పింఛన్‌దారులు, ధారూరు మండలంలో 4424 పింఛన్‌దారులు, దోమ మండలంలో 5861 పింఛన్‌దారులు, దౌల్తాబాద్ మండలంలో 6628 పింఛన్‌దారులు, కొడంగల్ మండలంలో 6463 పింఛన్‌దారులు, కోట్‌పల్లి మండలంలో 2848 మంది పింఛన్‌దారులు, కుల్కచర్ల మండలంలో 5630 మంది పింఛన్‌దారులు, మర్పల్లి మండలంలో 6369 మంది పింఛన్‌దారులు, మోమిన్‌పేట్ మండలంలో 5262 మంది పింఛన్‌దారులు, నవాబుపేట మండలంలో 4948 మంది పింఛన్‌దారులు, పరిగి మండలంలో 6595 మంది పింఛన్‌దారులు, పెద్దేముల్ మండలంలో 4858 మంది పింఛన్‌దారులు, పూడూరు మండలంలో 5922 మంది పింఛన్‌దారులు, తాండూరు మండలంలో 5612 మంది పింఛన్‌దారులు, తాండూరు మున్సిపాలిటీలో 6328 మంది పింఛన్‌దారులు, వికారాబాద్ మండలంలో 4428 మంది పింఛన్‌దారులు, వికారాబాద్ మున్సిపాలిటీలో 3698 మంది పింఛన్‌దారులు, యాలాల మండలంలో 5726 మంది పింఛన్‌దారులు ఉన్నారు.

అన్నం పెడుతున్న కేసీఆర్‌కే ఓటేస్తా..
-కుమ్మరిపల్లి పెంటమ్మ, గుడుపల్లి, వికారాబాద్
ముగ్గురు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉన్నా ఎవరూ పట్టించుకుంటలేరు. ఐదేండ్లుగా ఒంటరిగా బతుకుతున్నా. అప్పట్ల రూ.200 పింఛన్ వచ్చేది. ఆ పైసలు ఎటూ సరిపొయ్యేది కాదు. ఒక్కోసారి రెండునెలలకోసారి వస్తుండే. ఖర్సులకు తిప్పలయ్యేది. తెలంగాణ సర్కారు వచ్చినంక నెలకు వెయ్యి రూపాయలు ఇస్తున్నరు. సీఎం కేసీఆర్ సారు నా కన్న బిడ్డలెక్క నెలకు వెయ్యి రూపాయల పింఛన్ ఇచ్చి ఆదుకుంటుండు. అట్లనే ముందట 4 కిలోల బియ్యం వచ్చేది.. ఇప్పుడు 6 కిలోలు ఇస్తున్నరు. అన్నం పెడుతున్న కేసీఆర్‌కే ఓటేస్తా.

176
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...