ఓటరు జాబితాను పకడ్బందీగా నిర్వహించాలి


Tue,September 18, 2018 11:28 PM

చేవెళ్ల : ఓటరు జాబితాను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ లోకేశ్‌కుమార్ అధికారులకు సూచించారు. చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లతో ఓటరు జాబితా రూపొందించడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ ఏండ్లు నిండిన యువతీ, యువకులందరినీ ఓటర్లుగా నమోదు చేయడంపై దృష్టి సారించాలన్నారు. ఈ నెల 25వరకు కొత్త ఓటర్ల సమోదుతోపాటు సవరణలకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. వారి పేర్లను జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. ఏజెంట్లు పరిశీలన చేయాలని, చిరునామా మారితే వారితో దరఖాస్తు చేయించి మారిన చిరునామా చేయాలని, రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగించాలని సవరించిన ఓటర్ల తుది జాబితాను అక్టోబర్ 4న ప్రచురించనున్నట్లు తెలిపారు. ఉన్న అపోహాలను తొలగించేందుకు వీవీపీఏటీ ద్వారా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఓటు వేసిన ఏడు సంబంధిత వీవీపీఏటీలో ఓటరుకు కనిపిస్తుందని, ఎటువంటి అపోహాలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. నెల 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించిన ప్రత్యేక శిబిరాలకు స్పందన ఎలా ఉందని ఆర్డీఓ హనుమంతరెడ్డిని తెలుసుకున్నారు. 2,578 మంది దరఖాస్తు చేవెళ్ల మండలంలో 589, షాబాద్‌లో మొనాబాద్‌లో 607, శంకర్‌పల్లిలో 570, నవాబుపేట్‌లో 344 వచ్చాయని ఆర్డీఓ తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సిబ్బందిని అదేశించారు. మరమ్మతులుంటే పూర్తి చేయాలన్నారు. కరెంటు సరఫరాతోపాటు మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కలెక్టర్ హరీశ్, తహసీల్దార్లు పురుషోత్తం, శ్రీకాంత్‌రెడ్డి, నాగయ్య, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్

అర్హులందరూ ఓటు హక్కు పొందాలి
షాద్‌నగర్, నమస్తే తెలంగాణ అర్హత ఉన్న ప్రతిఒక్కరూ ఓటు హక్కును పొందాలని కలెక్టర్ లోకేశ్‌కుమార్ సూచించారు. షాద్‌నగర్ కార్యాలయంలో ఓటరు జాబితా, ముసాయిదా పత్రాలను పరిశీలించిన ఆయన.. పరిధిలోని మండలాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలన్నారు. నిండిన యువతీ, యువకులు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఓటరు జాబితాలో తమ పేర్లు లేదో తెలుసుకోవచ్చన్నారు. తమ పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హరీశ్, ఆర్డీఓ కృష్ణ, తహసీల్దార్లు కృష్ణకుమార్, బాలరాజు, ప్రమీళారాణి, లావణ్య, శంకుతల, అనితారెడ్డి, డీఏఓ ఆంజనేయులు, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ జయశ్రీ పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...