ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి


Wed,September 12, 2018 11:35 PM

ధారూరు : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సుధాకర్ షిం డే పేర్కొన్నారు. బుధవారం మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. కంటి వైద్య సిబ్బంది పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు చిన్న చిన్న కంటి సమస్యలతో బాధ పడుతూ పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోని వారికి ఈ శిబిరం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కంటి వైద్య శిబిరంలో ఈ రోజు 349 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 15 మందికి శస్త్ర చికిత్సల కోసం రెఫర్ చేశామన్నారు.

86 మంది అవసరమగు కంటి అద్దాలను ఉచితంగా అందజేయడం జరిగిందన్నారు. శుక్రవారం నుంచి ధారూ రు బాలికల ఉన్నత పాఠశాలలో ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ రాజు తెలిపారు. కార్యక్రమం లో కంటి వైద్యాధికారులు మాధవిలత, ఫార్మాసిస్టు ప్రాణే శ్, ఏఎన్‌ఎంలు సంతోశ్, నాగమణి, యాదమ్మ, శోభరాణి, రాకేశ్, సురేందర్, రాజేశ్, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.

99
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...