గుజరాత్ సమాజం అభివృద్ధికి కృషి


Wed,September 12, 2018 11:35 PM

తాండూరు టౌన్ : గుజరాత్ సమాజం ప్రజల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం రాత్రి తాండూరు పట్టణంలో ని భవానీ ఫంక్షన్‌హాల్‌లో టీఆర్‌ఎస్ నుంచి తాండూరు ఎమ్మెల్యే టికెట్ మం త్రి మహేందర్‌రెడ్డికి ఇవ్వడంతో గుజరాత్ సమాజం ప్రజలు సం తోషంతో ఆయనను ఘనంగా సన్మానించారు.వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మహేందర్‌రెడ్డిని గెలిపిస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గుజరాత్ సమాజం ప్రజలు సంప్రదాయ పండుగలు, ఫంక్షన్‌లు నిర్వహించుకునేందుకు తాండూరు పట్టణం లో వేయి గజాల భూమి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ కోట్రికె విజయలక్ష్మి, కౌన్సిలర్ పరిమళ, తాండూరు పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ రావుఫ్, నేతలు రజాక్, రవీందర్, నర్సింహులు, గుజరాత్ సమాజం ప్రజలు పాల్గొన్నారు.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...