అభ్యర్థి ఎవరైనా గెలుపునకు కృషి చేస్తాం


Wed,September 12, 2018 11:35 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ : వికారాబాద్ నియోజకవర్గ అభ్యర్థిగా టీఆర్‌ఎస్ టికెట్ ఎవరికి కేటాయించినా గెలుపునకు కృషి చేస్తామని తాజా మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక టీఆర్‌ఎస్ నాయకులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పథకాలు ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి బాటలు వేశారన్నారు. ముందస్తుగా ఎన్నికలకు రావడం సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నియోజకవర్గంలో 4 సంవత్సరాలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూసినట్లు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా ఏర్పాటుకు తనదైన పాత్రను పోషించినట్లు తెలిపారు. మూడు నాలుగు రోజుల్లో పార్టీ అధిష్ఠానం అభ్యర్థిని ప్రకటించనుందన్నారు. ఇందులో తనకు టికెట్ వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో మరోమారు టీఆర్‌ఎస్ గెలుపునకు కృషి చేస్తామన్నారు. అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. కార్యకర్తలంతా ఏకగ్రీవంగా ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాంచంద్రారెడ్డి, టీఆర్‌ఎస్ దారూరు మండలాధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సురేశ్, కౌన్సిలర్లు రాజమల్లయ్య, భరత్, రైతు సమన్వయ సమితి కో-ఆర్డినేటర్లు అనంత్‌రెడ్డి, చందర్‌నాయక్, నాయకులు శంకర్, బల్వంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సురేశ్, జగన్, కృష్ణారెడ్డి, దత్తు, రాజ్‌కుమార్, లింగం, ఆనందం, హన్మంత్, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...