గ్రంథాలయాల అభివృద్ధికి కృషి


Tue,September 11, 2018 11:54 PM

-యాలాల ఎంపీపీ సాయన్న గౌడ్
యాలాల: తెలంగాణ ప్రభుత్వం గ్రంథాలయాల అభివృ ద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నదని ఎంపీపీ సాయన్న గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం యాలాల మండల కేంద్రంలో ఉన్న శాఖా గ్రంథాలయం మరమ్మత్తు పనులకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. అభివృద్ధి పరంగా తెలంగాణ దూసుకుపోతున్నదని, అందులో భాగంగా గ్రంథాలయం మరమ్మతులకు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి రూ.4.70 లక్షలను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతో గ్రంధాలయంలో పాఠకులకు సౌకర్యాలను కల్పించడం జరుగుతుందన్నారు. గ్రంథాలయానికి ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం తదితర మరమ్మతులను చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ శోభారాణి మాట్లాడారు. ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి చేయూత నందిస్తున్నదని అన్నారు. నియోజకవర్గంలో యాలాల ,పెద్దేముల్,తాండూర్, బషీరాబాద్‌లలో గ్రంథాలయాల మరమ్మతులకు నిధులను ఇవ్వడం జరిగిందన్నారు. నిధులతో గ్రంథాలయాలలో మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతుందని అన్నారు.విద్యార్థులకు కావలసిన వివిధ రకాల పుస్తకాలను అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోకట్ ఎంపీటీసి శంకర్, టీఆర్‌ఎస్ బీసీ సెల్ కార్యదర్శి నర్సింహులు, యాలాల గ్రంథపాలకుడు అశోక్, యాలాల నాయకులు జి.నర్సిములు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...