అధికారులు ప్రజా సమస్యలను తీర్చాలి


Tue,September 11, 2018 11:54 PM

యాలాల: పంచాయతీ ప్రత్యేక అధికారులు ప్రజాసమస్యలను తీర్చడానికి కృషిచేయాలని ఎంపీపీ సాయన్న గౌడ్ అన్నారు. మం గళవారం మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభలు తప్పక నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక పాలన వచ్చి దాదాపు 40 రోజులు కావస్తున్నదని అన్నారు. ఈ రోజులలో రికార్డులు ఎలాఉన్నాయి, రికార్డులను స్వాధీనం చేసుకున్నారా, ఎన్ని నిధులు ఉన్నాయి. మీ పాలన వచ్చిన తరువాత ఎన్ని నిధులు ఖర్చు చేశారు. ఇంకా ఎన్ని నిదులు మిగిలాయి అనే విషయాలపై ఆరా తీశారు. చెక్ బుక్కు, క్యాష్ బుక్కు,పాస్ బుక్కు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలలో ప్రతి 500 జనాభాకు ఒక పని మనిషిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. 3 వేల జనాభా ఉంటే ఆరుగురిని ఏర్పాటు చేసుకుని పనులను చేయించాలని సూచించారు.గ్రామాలలో పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీటిలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సుధారాణి, ఎంఈవో సుధాకర్‌రెడ్డి, సుపరింటెండెంట్ భాగ్యవర్ధన్, వివిధ గ్రామాల పంచాయతీ కార్యదర్శులు , ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...