గ్రామాల రూపురేఖలు మారుస్తా


Tue,September 11, 2018 11:53 PM

-ఆశీర్వదించి గెలిపించండి
-రేవంత్ మాయమాటలకు మోసపోకండి
-ప్రజలకు అందుబాటులో ఉండి సేవచేస్తా
-కొడంగల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి
బొంరాస్‌పేట : వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడు నెలల్లో గ్రామాల రూపురేఖలు మారుస్తానని, ఆదర్శ గ్రామాలుగా మారుస్తానని కొడంగల్ నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తూరు, ఎన్నెమీదితండా, వడిచెర్ల, మహంతిపూర్ గ్రామాలలో టీఆర్‌ఎస్ జెండాలను ఎగురవేశారు. అనంతరం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రెండు పర్యాయాలు రేవంత్‌రెడ్డికి ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలను, గ్రామాల అభివృద్ధిని పట్టించుకోకుండా రాజధానికే పరిమతమయ్యాడని విమర్శించారు. మరోసారి రేవంత్‌రెడ్డి మాయ మాటలకు మోసపోయి ఓటు వేయరాదని, ప్రజలకు అందుబాటులో ఉండే వారినే ఎన్నుకోవాలని సూచించారు. గత 40 ఏండ్లుగా తండాల అభివృద్ధిని ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశాడని అన్నారు.

తండాలు పంచాయతీలుగా ఏర్పడడంతో ప్రజలకు పాలనా సౌలభ్యం కలిగిందని , కొత్తగా ఏర్పాటైన పంచాయతీలలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఏడాదికి రూ.20 లక్షల వరకు నిధులు మం జూరు చేస్తుందని, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.16 లక్షలు మంజూరు చేస్తుందని నరేందర్‌రెడ్డి అన్నారు. నాలుగున్నర ఏండ్లలో తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందని, వెనుకబడిన కొడంగల్ నియోజకవర్గాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశాడని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలను ప్ర భుత్వం అమలు చేసిందని న రేందర్‌రెడ్డి అన్నారు. కొత్తూరు, మహంతిపూర్ గ్రామాలకు రోడ్డు సౌకర్యం బాగా లేకపోతే తన నిధులనుంచి రూ.10 లక్షలు మంజూరు చేశానని నరేందర్‌రెడ్డి చెప్పారు. పేదల కోసం ఎన్నో మంచి పథకాలు అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీని ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని, కారు గుర్తుకే ఓటేస్తామని తండాలు, గ్రామాలలో ప్రజలు తీర్మానాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

రేవంత్‌రెడ్డికి నా శక్తి ఏంటో చూపిస్తా: గుర్నాథ్‌రెడ్డి
ఈసారి ఎన్నికల్లో రేవంత్‌రెడ్డికి తన శక్తి ఏంటో చూపిస్తానని మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో గడప గడపకు వెళ్లి ఓట్లు అడుగుతానని, టీఆర్‌ఎస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డిని గెలిపిస్తానని అన్నారు. గెలుగు బాధ్యత తనదేనని చెప్పారు. కార్యకర్తలు, ప్రజలు టీఆర్‌ఎస్‌కు సహకరించాలని అన్నారు. ఎన్నికల్లో ప్రజలే నిర్ణేతలని టీఆర్‌ఎస్ పార్టీకి మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి పనులకు నిధులు అడిగితే ఆంధ్రా పాలకులు ఇవ్వలేదని, తెలంగాణ వచ్చాక అడిగినన్ని నిధులు మంజూరు చేశారని అన్నారు. కొత్తూరు గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించిన ఘనత తనదేనని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నారని, ఈ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మళ్లీ టీఆర్‌ఎస్‌ను తప్పక గెలిపించాలని గుర్నాథ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

రైతు బీమా చెక్కులు పంపిణీ
మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇటీవల మృతిచెందిన ఇద్దరు రైతు కుటుంబాలకు రైతు బీమా చెక్కులను నరేందర్‌రెడ్డి, గుర్నాథ్‌రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన శివశంకర్ మృతిచెందగా అన్న శంకర్‌లింగంకు, రేగడిమైలారం గ్రామానికి చెందిన మొండి ఆశప్ప మృతిచెందగా ఆయన తల్లి ముద్దమ్మకు రూ.5 లక్షల చొప్పున రైతు బీమా చెక్కులను వారు పంపిణీ చేశారు. మొండి ఆశప్పకు ఇద్దరు భార్యలు ఉండడంతో రైతు బీమా సహాయంతో పాటు సీఎం రిలీఫ్ పండ్ నుంచి మరో రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మహేందర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ కోట్ల యాదగిరి, మాజీ ఎంపీపీ ప్రమీలమ్మ, పార్టీ నాయకులు మధుయాదవ్, రమణారెడ్డి, నారాయణరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, నరేశ్‌గౌడ్, బసిరెడ్డి, నర్సింహులుగౌడ్, సుభాన్‌రెడ్డి, శ్రావణ్‌గౌడ్, ఢాక్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

-ఘన స్వాగతం
టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి గ్రామాలలో ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. డప్పులు, బాణా సంచా కాలుస్తూ, కార్యకర్తలు ఆనందంగా నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు. కొత్తూరు, వడిచెర్ల గ్రామాలలో దర్గాలు, దేవాలయాలలో ప్రార్థనలు చేశారు.

127
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...