మహిళలు అభివృద్ధి చెందాలి


Tue,September 11, 2018 11:53 PM

వికారాబాద్ టౌన్: మహిళలు కూరగాయల సాగు ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చని సీడ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో నాగబ్రహ్మం అన్నారు. మంగళవారం వికారాబాద్ మండలం పులుమద్ది గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహిళలకు సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నాబార్డు సహకారంతో కూరగాయల సాగుపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సంఘాలుగా ఏర్పడితే నాబార్డు ద్వారా రుణ సదుపాయాలు కల్పిస్తారన్నారు. నాబార్డు ద్వారా వచ్చిన రుణంతో కూరగాయల సాగు చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్వేత, స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ పరమానందం తదితరులు పాల్గొన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...