అన్ని అంశాలపై అవగాహన కలిగి ఉండాలి


Tue,September 11, 2018 11:53 PM

- జిల్లా విద్యాధికారి రేణుకాదేవి
- ఉర్దూ మీడియం పాఠశాలలో స్వచ్ఛత పక్షోత్సవాల పోటీల ముగింపు కార్యక్రమం
వికారాబాద్, నమస్తే తెలంగాణ : విద్యార్థినీ, విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలే కాకుండా అన్ని రకాల అంశాలపై ఆసక్తితో అవగాహన కలిగి ఉన్నప్పుడే సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించుకోవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి జి.రేణుకాదేవి అన్నారు. మంగళవారం వికారాబాద్ జడ్పీహెచ్‌ఎస్ ఆలంపల్లి ఉర్దూ మీడియం పాఠశాలలో స్వ చ్ఛత పక్షోత్సవాల పోటీల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, ట్యాలెంట్ టెస్టు, స్వచ్చభారత్ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర అంశంపై పోటీలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని 18 మండలాల నుంచి 120 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయిలో వ్యాసరచన, చిట్రలేఖనం, ట్యాలెంటెస్టు, ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులు ఈ నెల 15న ఎస్‌సీఈఆర్‌టీ హైదరాబాద్‌లో జరుగు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సమన్వయ కర్త రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముజిబ్‌పాషా, విశ్వేశ్వర్, వెంకటయ్య, సంతోశ్‌కుమార్, చిన్నికృష్ణ పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...