అధికారుల సేవలు మరువలేనివి


Tue,September 11, 2018 11:53 PM

-సమన్వయంతో పని చేయాలి
-అనంతగిరి ప్రాంతాన్ని కాపాడాలి
-అటవీ శాతాన్ని పెంచాలి
-ఎస్పీ అన్నపూర్ణ
-అనంతగిరి అటవీ శాఖ ఆధ్వర్యంలోఅమర వీరుల సంస్మరణ సభ
వికారాబాద్ రూరల్ : అటవీ శాఖ అధికారుల సేవలు మరువలేనివని ఎస్పీ అన్నపూర్ణ కొనియాడారు. మంగళవారం పట్టణంలోని అనంతగిరి ఫ్యారెస్టు గెస్టుహౌజ్‌లో అటవీ అమర వీరుల సం స్మరణ దినోత్సవానికి హాజరయ్యారు. సంస్మరణ దినానికి హాజరై అమరులైన అటవీ శాఖ అధికారులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజస్థాన్‌లో జరిగిన దుర్గ ఘనకు కారణంగానే సెప్టెంబర్ 11న అటవీ శాఖ అమలర వీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటామన్నా రు. వీర మరణం పొందిన అటవీ శాఖ అధికారు లు ఎన్నో సేవలు అందించారన్నారు. కామరెడ్డి గూడలో జరిగిన గంగయ్య అతి కృరంగా చంపారని తెలిపారు. జిల్లాలో అత్యధికంగా అటవీ ప్రాంతం ఉందని, దీనిని కాపాడే బాధ్యత ఫ్యారెస్టు అధికారులు తీసుకుంటున్నారన్నారు.

అనంతగిరి ముఖ్యంగా టూరిజం పేరుతో ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. పర్యాటకులతో సందడిగా నెలకొనేందుకు కారణం ఈ అటవీ ప్రాంతమే అన్నారు. కోట్‌పల్లి ప్రాజెక్టుకు వెళ్లాలంటే అనంతగిరి గుట్లను దాటి అందాలను ఆస్వాదిస్తూ వెళ్లాలన్నా రు. అటవీ శాఖ అధికారులకు పోలీస్‌లు వెన్నుదండుగా ఉండి సహాయం అందిస్తారన్నా రు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఉపయోగించుకోవాలన్నారు. అనంతగిరి ఫ్యారెస్టును అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతగిరిలో ఎలాంటి అసంఘటిత కార్యక్రమాలు జరుగకుండా సీసీ కెమెరాలను కలెక్టర్ సహాయంతో ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా ఐదు లారీలను, ఒక ట్రాక్టర్‌లో అక్రమంగా కలపను తరలిస్తుండగా పట్టుకొని సీజ్ చేయడం జరిగిందన్నారు. పోలీస్ ఫ్యారెస్టు శాఖ మధ్య పరస్పర సంబంధాలు ఉండాలన్నారు. అనంతరం మొక్కలు నాటి నీరు పోశారు. కార్యక్రమంలో డీఎఫ్‌వో వేణుమాధరావు, ఫ్యారెస్టు అధికారులు పాల్గొన్నారు.

91
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...