విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలి


Tue,September 11, 2018 11:52 PM

-100 శాతం ఉత్తీర్ణత సాధించాలి
-నిర్లక్ష్యం చేయకుండా చదువుపై దృష్టి పెట్టాలి
-అధ్యాపకులు సమయానికి కళాశాలకు రావాలి
-జిల్లా నోడల్ అధికారి శంకర్
-పలు కళాశాలల తనిఖీలు
మర్పల్లి : విద్యార్థులు క్రమ శిక్షణతో చదువుకొని 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అధ్యాపకులు సమయానికి కళాశాలకు వచ్చి విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించినప్పుడే ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా చదువుపై దృష్టి సారించి ఉత్తీర్ణత సాధించినప్పుడే కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుందన్నారు. మొదటి సారిగా కళాశాలకు రావడంతో శంకర్‌ను కళాశాల సిబ్బంది సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.

88
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...