కళాశాలలో గుణాత్మకమైన విద్య


Tue,September 11, 2018 11:52 PM

మోమిన్‌పేట : ప్రభుత్వ కళాశాలలో గుణాత్మకమైన విద్య అందుతుందని, ప్రతి విద్యార్థి ప్రభుత్వం కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా నోడల్ అధికారి శంకర్ నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. కళాశాల సమావేశం మందిరంలో విద్యార్థులతో సమావేశమైనారు. ఈ సందర్భ ంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల విదార్థులకు మెరుగైన విద్య ను అందించుట కోసం ప్రభుత్వం ఎం తో కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ కళాశాలలో ప్రతి విద్యార్థిపై వ్యక్తి గత దృష్టి తో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు అర్హులైన అధ్యాపకులు ఉంటారన్నారు. విద్యతో పాలు సామాజిక కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

84
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...