విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి


Tue,September 11, 2018 11:52 PM

మర్పల్లి : పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థుల కు ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను బోధించి బం గారు బాట వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా గిరిజన సాంఘిక సంక్షేమాధికారి కోఠాజీ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని గిరిజన సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేశారు. వసతి గృహంలోని పలు గదులను పరిశీలించారు. అనంతరం 100 మంది విద్యార్థులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహంలో ఉం టూ చదువుకుంటున్న విద్యార్థులకు ప్రభుత్వం నిధు లు ఖర్చు చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అన్ని మౌలిక వసతులు కల్పించేందుకు పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి ఏడాది ఒక్కొక్క వి ద్యార్థిని నాలుగు జతల దుస్తులు, పరుపులు, దు ప్పట్లు తదితర వస్తువులను అందజేయడం జరుగుతుందన్నారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని వీడి సమయానికి పాఠశాలకు వచ్చి విద్యార్థులకు నా ణ్యమైన విద్యనందించాలన్నారు. చదువులో వె నుకబడిన విద్యార్థులు ఉన్నా వారిపై ప్రత్యేక దృ ష్టి పెట్టాలన్నారు. వారం లోగా వసతి గృహంలో ఉన్న సమస్యలన్ని పరిష్కరించాలని వసతి గృహ ం ప్రత్యేకాధికారి నర్సింహులును ఆదేశించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...