ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు చేయాలి


Tue,September 11, 2018 11:52 PM

మోమిన్‌పేట : మండల కేంద్రంలో ఉన్న నందివాగు ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా గుర్తించి బో టింగ్ ఏర్పాటు చేయాలని మండల మత్స్యశాఖ సంఘం సభ్యులు ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కోరారు. మంగళవారం మోమిన్‌పేట గ్రామ పంచాయతీ ఆవరణలో మండల మత్స్యశాఖ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా వారు ప్రభుత్వం మత్స్యకారులను సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేసిందని అన్నారు. ప్రభుత్వం పూర్తి సబ్సిడీపై చేప పిల్ల ల పంపిణీ చేసిందని, చేప పిల్లల పెంపకంలో సం రక్షణ కోసం చెరువుల చుట్టూ తిరుగాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టులో బోటింగ్ ఏర్పాటు చేస్తే చేప ల పెంపకంతో పాటు బోటింగ్ నడిపించుకుంటూ ఉపాధి పొందుతామన్నారు. ప్రాజెక్టును సందర్శించడానికి కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా వ చ్చి వెళ్లుతుంటారన్నారు. ఎంపీ మత్స్య కారులను దృష్టిలో ఉంచుకొని బోటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో మోమిన్‌పేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డైరెక్టర్ మహిపాల్‌రెడ్డి, మండల టీఆర్‌ఎస్ ఉపాధ్యక్షుడు నర్సింహు లు సీనియర్ నాయకులు, మత్స్యశాఖ సంఘం అధ్యక్షుడు బి.రాజు, ఉపాధ్యక్షుడు రామరాజు, సభ్యులు పాల్గొన్నారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...