బియ్యాన్ని సక్రమంగా అందించాలి


Tue,September 11, 2018 11:52 PM

-నిల్వల్లో తేడాలుంటే చర్యలు తప్పవు
-ఈ-పాస్ యంత్రాలతో సరఫరా చేయాలి
-డీటీలు నందిని, ఫయాజ్
-పలు దుకాణాల్లో తనిఖీలు
దోమ : రేషన్ దుకాణాల్లో నిల్వల్లో తేడాలుంటే చర్యలు ఉంటాయని జిల్లా పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు నందిని, ఫయాజ్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పలు రేషన్ దుకాణాలను సందర్శించి తనిఖీలు చేపట్టారు. దుకాణాల్లో ఉన్న రేషన్ బియ్యం నిల్వలు, షాపుల వారీగా నిల్వను సరి పరిశీలించారు. రేషన్ దుకాణాల్లో నిల్వలు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలని డీలర్లకు సూచించారు. రూపాయి కిలో బి య్యాన్ని రాయితీపై ప్రభుత్వం ఖర్చులను భరించి తెల్లరేషన్ కార్డుదారులకు అందజేస్తున్నందున సకాలంలో రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులకు అంది ంచాలని వారు సూచించారు. ప్రతి నెలా జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని, రేషన్ దు కాణాల నిర్వాహకులు లబ్ధి దారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. ఈ-పాస్ యంత్రాలతో అందిస్తున్నందున రేషన్ డీల ర్లు కూడా జాగ్రత్తగా రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని సూచించారు. కిరోసిన్ నిల్వను కూడా పరిశీలించారు. మండలంలోని పలు రేషన్ దుకాణాలను తనిఖీలు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈ-పాస్ యంత్ర సిబ్బంది నవీన్‌కుమార్ పాల్గొన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...