టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం


Tue,September 11, 2018 11:52 PM

-ప్రజా సౌకర్యం కోసం కోరిన నిధులు మంజూరు
-టీఆర్‌ఎస్ యువ నాయకుడు జగదీశ్వర్‌రెడ్డి
కొడంగల్, నమస్తే తెలంగాణ : టీఆర్‌ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యపడుతుందనేది గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో స్పష్టమైందని, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికంగా మారిందని టీఆర్‌ఎస్ యువనాయకులు జగదీశ్వర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఇంద్రానగర్ కాలనీలో సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి మంత్రులు, మాజీ ఎమ్మెల్యే కోరిక మేరకు ప్రజా సౌకర్యాలను గుర్తించి అభివృద్ధికి వందలాది కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. కొడంగల్ పట్టణంలోని ఆయా కాలనీల్లోని అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఇదివరకు పట్టణంలోని కార్గిల్ కాలనీ, సన్‌సిటీ కాలనీ, శాంతినగర్ కాలనీ తదితర కాలనీలలో సీసీ రోడ్లు ఏర్పాటైనట్లు తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో నిధులు మంజూరు కాని కారణంగా కొడంగల్ అభివృద్ధికి నోచుకోలేక పోయిందని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిధుల మంజూరుతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామ పంచాయతీకి బీటీ రోడ్లు కూడా మంజూరైనట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధికి ప్రజలు సీఎం కేసీఆర్‌కు బ్రహ్మరథం పడుతున్నారని, రానున్న రోజుల్లో మళ్లీ పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్వ ఎల్లప్ప, వెంకటప్ప, కంటు. నాగు, వడ్డె రాజు. భీములు, తూం నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్లు వస్తాయని ఊహించలేదు
ఇంద్రానగర్ కాలనీ ఏర్పడి కొన్ని సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కాలనీ అభివృద్ధికి ఎవరూ పట్టించుకోలేదు. గత రెండు పర్యాయాలు రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించినప్పటికీ ఎటువంటి అభివృద్ధి చేపట్టలేకపోయారు. టీఆర్‌ఎస్ ప్రభు త్వం ఏర్పడిన గత నాలుగున్నర ఏండ్ల కాలంలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు సాగి దేశంలో ఓ వెలుగు వెలుగుతున్నది. ఇంత త్వరగా సీసీ రోడ్లు వస్తాయని కలలో కూడా ఊహించలేదని, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు అందించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరింది.
వెంకటయ్య (మాఫి), కొడంగల్

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...