వాసుపవార్ నాయక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు


Tue,September 11, 2018 11:51 PM

తాండూరు, నమస్తే తెలంగాణ: తాండూరు నియోజకవర్గంలోని ప్రముఖ భూ కైలాస్ ఆలయ చైర్మన్ వాసు పవార్ నాయక్‌ను తాండూరు, కొడంగల్ నియోజకవర్గాల గిరిజనుల కమిటీకి ఇన్‌చార్జిగా నియమిస్తూ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. రానున్న శాసనసభ నియోజకవర్గం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలుపునకు అన్ని వర్గాల్లోని నాయకులకు ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగిస్తున్న నేపథ్యంలో వాసుపవార్ నాయక్‌ను కూడా రెండు కీలక నియోజకవర్గాలకు గిరిజన కమిటీకి ఇన్‌చార్జిగా నియమించారు. వాసు పవార్ నాయక్‌కు గిరిజన కమిటీ ఇన్‌చార్జి బాధ్యతలను రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి దగ్గరుండి మంత్రి కేటీఆర్ చేత ఇప్పించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావులు ఉన్నారు.

85
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...