విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలి


Tue,September 11, 2018 11:51 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని వికారాబాద్ డీఎస్పీ శిరీష అన్నారు. మంగళవారం వికారాబాద్ గౌతమి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో స్థానిక సత్యభారతి గార్డెన్‌లో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుంచే లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్లాలన్నారు. చెడు అలవాట్లు దరిచేరనీయొద్దన్నారు. క్రమ పద్ధతిలో ప్రణాళిక ప్రకారం చదువాలన్నారు. అబ్దుల్‌కలాం లాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి, కళాశాల నిర్వాహకులు రాంచందర్, కృష్ణ, నరేశ్, ఆనంద్, ప్రసన్న, విజయలక్ష్మి, లక్ష్మి, అనిత, రేష్మ, శైలజ, విద్యార్థులు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...