మహేందర్‌రెడ్డికి వ్యాపార వర్గాల మద్దతు


Mon,September 10, 2018 11:51 PM

తాండూరు టౌన్ : ప్రజల మంచి చెడుల్లో రాత్రనకా, పగలనక పాల్గొంటూ ప్రజల మనిషిగా పేరొందిన తాండూరు ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి మరో సారీ టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ రావడంతో తాండూరు ప్రాంతం ప్రజలు అడుగడుగునా మద్దతు తెలుపుతున్నారు. సంతోషంతో సన్మాన కార్యక్రమాలు చేస్తున్నారు. సోమవారం తాండూరు పట్టణంలో క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దయానంద బాలవిహార్ పాఠశాలలో, విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో 28వ వార్డులో బంగారు వెండి వ్యాపారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి మంత్రి మహేందర్‌రెడ్డికి మద్దతు తెలుపుతూ వచ్చే ఎన్నికల్లో మీకే మా ఓటు అంటూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ హయాంలోనే అధిక నిధులు తీసుకొచ్చి తాండూరు మున్సిపల్‌తో పాటు నియోజకవర్గంలోని గ్రామాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.

రాజకీయ పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకొని పరిష్కరించినట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రజల కోరిక మేరకు అన్నివర్గాల భవన నిర్మాణాలకు భూమితో పాటు ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. క్లాత్ మర్చంట్ అసోసియేషన్ భనవ నిర్మాణానికి రూ. 10లక్షలు, వెండి, బంగారు వ్యాపారుల సంఘం భవన నిర్మాణం, రోడ్డుకు రూ. 15 లక్షలు మూడు రోజుల్లో ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమకు సంపూర్ణ మద్దతు తెలిపి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నేతలు పురుషోత్తంరావు, రావుఫ్, అమిత్, కోట్రికె విజయలక్ష్మి, పరిమళ, నర్సింహులు, జుబేలాల, వడ్డె శ్రీను, రఘునందన్, రాకేశ్, క్లాత్ మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధులు భగవాన్‌దాస్, అంబయ్య, గోపాలకృష్ణ, దీపక్ ఘగరాణి, నాగరాజు, మోహన్‌కుమార్, బంగారు, వెండి వ్యాపారుల సంఘం ప్రతినిధులు కల్వ విజయ్, లింగమేశ్వర్, కల్యాణంశ్రీనివాస్, ప్రవీణ్, సురేశ్ ఉన్నారు.

113
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...