మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్ లో భారీగా చేరికలు


Mon,September 10, 2018 11:50 PM

యాలాల : యాలాల మండలంలోని జెక్కెపల్లి, దేవనూర్, ముకుందాపూర్ గ్రామాలకు చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సోమవారం మంత్రి మహేందర్‌రెడ్డి సమక్షంలో ఆయన నివాసంలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్‌ఎస్ రైతు ప్రభుత్వం రైతులకు కావాల్సిన 24 గంటల ఉచిత కరెంటు, సాగునీరు, తాగునీరు ఇస్తున్నదన్నారు. అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ట్లు వారు పేర్కొన్నారు. చేరిన వారిలో జెక్కెపల్లి బసయ్యతో పాటు వివిధ గ్రామాల నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సిద్రాల శ్రీనివాస్, ఎంపీపీ సాయన్నగౌడ్, మాజీ ఎంపీపీ పురుషోత్తమరావు తదితరులు పాల్గొన్నారు.

111
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...