ప్రజా శ్రేయస్సు కోరుకున్నది సీఎం కేసీఆర్


Sun,September 9, 2018 11:25 PM

-తమ సుఖాన్ని కోరుకునేది కాంగ్రెస్ నాయకులు
-నా పాలనలో పైరవీ కారులకు నష్టం జరుగొచ్చు
-కానీ, ప్రజలకు నష్టం చెయ్యలే
-సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను చూసి ప్రజలు ఓట్లు వేస్తారు
-మరోమారు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం
-తాజా మాజీ ఎమ్మెల్యేవై. అంజయ్యయాదవ్
షాద్‌నగర్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రజల సుఖాన్ని కోరుకునేది సీఎం కేసీఆర్‌అయితే, తమ సుఖాన్ని కోరుకునేది కాంగ్రెస్ నాయకులు అని తాజా మాజీ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ ఎద్దేవాచేశారు. సర్కారు నిధులు వస్తే లోపట వెసుకునేటోళ్లు కాంగ్రెస్ నాయకులని, ఐఏఎస్ అధికారులను సైతం జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్‌పార్టీకి ఉందని విమర్శించారు. చిమ్మచీకట్లు కమ్ముకున్న తెలంగాణ రాష్ట్రంలో జ్యోతిని వెలిగించింది సీఎం కేసీఆర్ అని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోమారు అఖండ మెజార్టీతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటుకు దోహదపడుతాయని అన్నారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో అంజయ్యయాదవ్ మాట్లాడారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా, ఆరు కిలోల బియ్యం, విద్యార్థులకు సన్న బియ్యం, గురుకుల పాఠశాలలు, కేసీఆర్ కిట్, విద్యార్థినులకు హెల్త్ కిట్, కంటి వెలుగు, రైతు బంధు, రైతుబీమా, రాయితీ వ్యవసాయ యంత్రా లు వంటి పథకాలు అన్ని వర్గాల ప్రజలకు అందాయని చెప్పారు.

మరోమారు కేసీఆర్ సీఎం అయితే తెలంగాణ చరిత్రను మారుస్తారని, బంగారు తెలంగాణ మన కండ్ల ముందు కనిపిస్తదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన రోజులన్నీ షాద్‌నగర్ నియోజకవర్గ ప్రజల కోసం పనిచేశానని స్పష్టం చేశారు. తన హయాంలో పైరవీ కారులకు ఇబ్బందులు కలుగొచ్చు కానీ, ప్రజలకు మాత్రం ప్రయోజనం కలిగిందని అభిప్రాయపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గ అభివృద్ధి వందల కోట్ల నిధులు తీసుకొచ్చానని, ప్రతి పల్లెకు బీటీ రోడ్డు, అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు ఏర్పాట్లు చేశామని వివరించారు. సీఎం కేసీఆర్ చెప్పినంత వరకు లక్ష్మీదేవిపల్లి అనే పేరు వినని కాంగ్రెస్ నాయకులు, లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గురించి మాట్లాడం హాస్యాస్పదమని మండిపడ్డారు. ఈ దఫా ప్రభుత్వంలో కచ్చితంగా లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పారు.

మారుమూల పల్లెలను, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చామని, అన్ని గ్రామాల్లో ప్రజలకు మౌలిక వసతులను కల్పించామని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో షాద్‌నగర్ నియోజకవర్గంలో ప్రజలు ఊహించని అభివృద్ధి జరిగిందనే విషయాన్ని గమనించాలని కోరారు. సంక్షేమ పథకాలు, సీఎం కేసీఆర్ పాలన తీరు టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కె. నరేందర్, టీఆర్‌ఎస్ మండలాల అధ్యక్షులు పద్మారెడ్డి, జనార్ధన్‌రెడ్డి, రాజేశ్ పటేల్, మురళీధర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి అంజయ్యయాదవ్ చేసిన కృషి వెలకట్టలేనిదని అభిప్రాయపడ్డారు. 2001 నుంచి టీఆర్‌ఎస్ పార్టీలో ఉంటూ ప్రజల శ్రేయస్సు కోసం సైనికూడిలా పనిచేశారని, అంజయ్యయాదవ్ గెలుపు కోసం ఐకమత్యంతో పనిచేస్తామని చెప్పారు. ఈ సమావేశంలో ఆరు మండలాల టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

116
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...