ప్రజా కవి కాళోజీ


Sun,September 9, 2018 11:25 PM

వికారాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజాకవి కాళోజీ యాసా, భాషకు పట్టం కట్టిన మహనీయుడని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొండల్‌రెడ్డి అన్నారు. ఆదివారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని జిల్లా గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళోజీ కవిత్వం ప్రజలను ఉత్తేజపరిచే విధంగా ఉంటుందన్నారు. ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ తీసుకొని ముందుకుసాగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు. అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడని కాళోజీ ప్రజల్లో చైతన్యం కల్పించారన్నారు. ఎన్నో కవిత్వాలను రచించారని తెలిపారు. తెలంగాణ యాస, భాషకు సాహిత్య గౌరవం కల్పించిన కాళోజీ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు రామేశ్వర్, గ్రంథాలయ సంస్థ సిబ్బంది, పాఠకులు పాల్గొన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...