పేదల సంక్షేమానికే పథకాలు


Sun,September 9, 2018 11:24 PM

శంకర్‌పల్లి: టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలు, రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం ఎల్వెర్తికి చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ ఎం.పాపారావు, నాయకులు మహేందర్‌రెడ్డి, చెన్నారెడ్డి ఆధ్వర్యంలో స్థానిక గెస్ట్‌హౌస్‌లో కాలె యాదయ్య సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను రాజు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి పంటల సాగుకు 24 గంటల కరెంట్‌ను ఉచితంగా ఇస్తున్నారన్నారు. రైతుబంధు, బీమా పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటున్నారని చెప్పారు. పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించడానికి రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. ఈ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్ బోధన జరుగుతుందన్నారు. ఆసరా పింఛన్లతో ఎందరో అభాగ్యులను ఆదుకుంటున్నారని తెలిపారు.

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టి రూ.లక్షా116 వేలు అందిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు, గుడి మల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ డి.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరుగబోయే ఎన్నికల్లో కాలె యాదయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శంకర్‌పల్లి ఏఎంసీ చైర్మన్ రాజునాయక్, వైస్ చైర్మన్ బి.వెంకట్రాంరెడ్డి, డైరెక్టర్లు ఎస్.శ్రీకాంత్‌రెడ్డి, పాండు యాదవ్, కొండ మాణెయ్య, గుడి మల్కాపూర్ ఏఎంసీ చైర్మన్ శేరి అనంత్‌రెడ్డి, మిర్జాగూడ ఎంపీటీసీ రవీందర్‌గౌడ్, టీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వి.వాసుదేవ్‌కన్నా, అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, యువత అధ్యక్షుడు శ్రీనాథ్‌గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ కె.గోపాల్, నాయకులు చంద్రమౌళి, అజ్మత్, ఎస్.నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

86
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...