పరిగిలో టీఆర్‌ఎస్‌దే గెలుపు


Sun,September 9, 2018 11:24 PM

పరిగి, నమస్తే తెలంగాణ: అసెంబ్లీ ఎన్నికల్లో పరిగి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ కొప్పుల మహేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం దోమ మండలం దిర్సంపల్లి గ్రామానికి చెందిన యువజన సంఘం నాయకులు బాలకృష్ణ, హన్మంతు, చుక్కయ్య, బి.నర్సింలు, టి.శ్రీనివాస్, కె.వెంకట్, ఎం.గంగయ్య, ఎం.శ్రీనివాస్, బి.యాదయ్య, కె.శ్రీనివాస్, కె.శ్రీకాంత్, బి.పాండు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మహేశ్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలంతా తిరిగి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. అన్నివర్గాల వారు టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. పరిగి నియోజకవర్గంలో ఈసారి టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, భారీ మెజార్టీతో టీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ఊరూరా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పథకం ద్వారా సంక్షేమ ఫలాలు అందాయని తెలిపారు. ప్రతి గ్రామంలో కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాల్సిందిగా సూచించారు.

103
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...