అభివృద్ధి వైపు.. తెలంగాణ పరుగు


Sun,September 9, 2018 12:03 AM

ప్రభుత్వ పథకాల అమలుపై ఇతర రాష్ర్టాల ఆసక్తి
మళ్లీ అధికారం టీఆర్‌ఎస్ పార్టీదే
మంత్రి మహేందర్‌రెడ్డి
పార్టీలో చేరిన కోటబాస్పల్లికి చెందిన 150మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
తాండూరు రూరల్ : దేశం గర్వించే రీతిలో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి వైపు దూసుకు వెళ్లేలా సీఎం కేసీఆర్ చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. ఇక్కడ చేపడుతున్న పథకాలు ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయని గుర్తు చేశారు. శనివారం మండలంలోని కోటబాసుపల్లి గ్రామానికి చెందిన 150మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారిని చేవెళ్లలో పార్టీ కండువా లు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జి.రామదాస్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కోటబాసుపల్లి గ్రామానికి చెందిన మాజీ డీసీసీబీ చైర్మన్ సాయిరెడ్డి పెద్ద కుమారుడు వీరేందర్‌రెడ్డితోపాటు గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ, ఓసీలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌పార్టీలో చేరారు.

సుమారు 15 వాహనాల్లో తాండూరు నుంచి వెళ్ళి మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో బాసుపల్లికి చెందిన సాయిరెడ్డి రెండు పర్యాయాలు డీసీసీబీ చైర్మన్‌గా, టీడీపీలో పలు పదవులు నిర్వహించారని అన్నారు. సాయిరెడ్డి పెద్ద్ద కుమారుడు వీరేందర్‌రెడ్డితోపాటు కుటుంబ సభ్యులు, గ్రామానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు నాయకుఉఉఉi తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మంత్రి పి.మహేందర్‌రెడ్డి గెలుపునకు అహర్నిశలు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. వారి వెంట జడ్పీటీసీ సభ్యు డు రవీందర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, మండల రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు.

పార్టీలో చేరిన నాయకులు
కోటబాసుపల్లికి చెందిన వీరేందర్‌రెడ్డితోపాటు వెంకట్‌రెడ్డి (బాబు), రవీందర్‌రెడ్డి (లాయర్) వడ్ల ఈరన్న, అవుసుల శ్రీహరి, నర్సింహులు, నర్సింహారెడ్డి, మంగళి శ్రీకాంత్, చాకలి గోపాల్, నారాయణ, సంగారెడ్డి, ఈడ్గి నర్సింహులు(మాజీ సర్పంచు), వడ్ల మల్లప్ప, గోవింద్, బాబు, హన్మంతు, శ్రీనివాస్‌గౌడ్, అమ్రేష్, ఎండీ అలీ, మౌలానా, బెన్నూర్ రమేశ్, సమ్మప్ప, సైదప్ప, గౌసొద్దీన్, కురుమ మహేశ్ పలువురు కార్యకర్తలు, నాయకులు ఉన్నారు.

123
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...