లోక్ అదాలత్‌లో సమస్యలు పరిష్కారం


Sat,September 8, 2018 11:53 PM

పరిగి, నమస్తే తెలంగాణ : లోక్ అదాలత్‌లో ఇరువర్గాల సమ్మతితో సమస్యలు పరిష్కరించుకోవచ్చని పరిగి జూనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. శనివారం పరిగి కోర్టులో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి భారతి మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పు అన్ని రకాలుగా కోర్టు తీర్పులతో సమానమని తెలిపారు. లోక్ అదాలత్ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం లేదన్నారు. ఇరువురు వ్యక్తులు, వర్గాల మధ్య గల భూములు, ఆస్తులు, పెండ్లి, విడాకులు, పంపకాలకు సంబంధించి చట్ట ప్రకారం రాజీ పడదగిన నేరాలు, ఇరువర్గాల సమ్మతమైన, చట్ట సమ్మతమైన రీతిలో చట్ట ప్రకా రం తగువులను పరిష్కరించడం జరుగుతుందని జడ్జి పేర్కొన్నారు. లోక్ అదాలత్‌లను ఆశ్రయించినట్లయితే తక్కువ సమయంలో, ఖర్చు లేకుండా ఇరువర్గాల సమ్మతమైన, పటిష్టమైన న్యాయాన్ని పొందే అవకాశం ఉందని జడ్జి చెప్పారు. ఈ సందర్భంగా మొత్తం 57 కేసులు పరిష్కారమయ్యాయి. ఇందులో 22 బ్యాంకులకు సంబంధించిన కేసులు, 8 రోడ్డు ప్రమాద కేసులు, 21 ఎక్సైజ్ కేసులు, 6 ఐపీసీ కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.వెంకట్‌రెడ్డి, ఏపీపీ దీపికారాణి, ఏజీపీ సీహెచ్ బాలముకుందం, న్యాయవాదులు అనంతరెడ్డి, బి.లింగం, దా మోదర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జయలక్ష్మి, ఇబ్రహీంఖాన్, కైసర్‌పాష, రాంచందర్, శ్రీశైలం, కృష్ణయ్య పాల్గొన్నారు.

122
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...