పాడి పరిశ్రమను అభివృద్ధి చేసుకుంటాం


Sat,September 8, 2018 11:53 PM

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణ రెడ్డి
పెద్దేముల్ : తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ సమీక్షా సమావేశం శనివారం హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయ ఆవరణలో జరిగినది. ఈ సమావేశానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పి.నారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో నారాయణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆధీనంలో పనిచేస్తున్న మదర్ డెయిరీ, విజయ డెయిరీ, కరీంనగర్ డెయిరీ, ముల్కనూర్ డెయిరీలకు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల 13 వేల పాడి పశువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పాల ఉత్పత్తిని మనం ఇతర రాష్ర్టాల నుంచి ఉత్పత్తి చేసుకుంటున్నామని, అలా కాకుండా మన రాష్ట్రంలోనే పాల ఉత్పత్తి ఇతర రాష్ర్టాలకు ఉత్పత్తి చేసే విధంగా పాడి పరిశ్రమను అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతే కాకుండా రూ 16 కోట్లతో రంగారెడ్డి జిల్లా కంసాన్ పల్లిలో వీర్య ఉత్పత్తి కేంద్రాన్ని త్వరలోనే ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా ప్రభుత్వం గోపాల మిత్రలకు వారి జీతాలను 3,500 నుంచి 8,500 వరకు పెంచిందని గుర్తు చేశారు. ఇంకా గోపాల మిత్రలు బాగా కృషి చేసి పాడి పరిశ్రమ అభివృద్ధి చేస్తే మరోమారు వారి జీతాలను పెంచడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మొత్తం 9 జిల్లాల గోపాల మిత్రలు సుమారు 1300 మంది హాజరయ్యారు.
రాష్ట్ర పశుగణాభివృద్ది సంస్థ చైర్మన్, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర 9 జిల్లాల పశుగనాభివృద్ది సంస్థల చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...