ఆలయాల్లో ప్రత్యేక పూజలు


Sat,September 8, 2018 11:53 PM

వికారాబాద్ టౌన్ : పట్టణంలోని శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయంలో మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్‌కుమార్ దంపతులు శ్రావణ శనివారాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రామేశ్వరాలయానికి భక్తుల సందడి
మోమిన్‌పేట : మండలంలోని పలు గ్రామాల్లో పండుగ వాతావరణం తలపించింది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోమిన్‌పేటలో మాణిక్ ప్రభు మందిరంలో ప్రత్యేక భక్తి కార్యక్రమాలతో పాటు భజన నిర్వహించారు. మండల పరిధిలోని రాళ్ళగుడుపల్లి గ్రామ సమీపంలోని రామలింగేశ్వ ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడానికి మండల భక్తులే కాకుండా సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి వందల సంఖ్యలో వచ్చారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...