టీఆర్‌ఎస్‌కు తప్ప మిగతా పార్టీలకు భవిష్యత్ లేదు


Sat,September 8, 2018 11:53 PM

- టీఆర్‌ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవినాశ్‌రెడ్డి
- షాబాద్‌లో వివిధ పార్టీలకు చెందిన 60 మంది కార్యకర్తలు పార్టీలో చేరిక
షాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు తప్ప మిగతా పార్టీలకు భవిష్యత్ లేదని టీఆర్‌ఎస్ యు వజన విభాగం జిల్లా అధ్యక్షుడు పట్నం అవినాశ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలో ముద్దెంగూ డ, నాందార్‌ఖాన్‌పేట్ గ్రామాలకు చెందిన 60 మంది బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అవినాశ్‌రెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలు గల్లంతు కావడం ఖాయమని అన్నారు. టీఆర్‌ఎస్‌ను తప్ప మిగ తా పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. నాలుగేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీ ల నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్నారని స్ప ష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాలో అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించుకుని జిల్లాను గులాబీ కంచుకోటగా మారుస్తామని చెప్పారు. రైతు బంధు, రైతు బీమా, మిష న్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, భీం లానాయక్, దర్శన్, సతీశ్‌రెడ్డి, జయంత్‌రెడ్డి, కిట్టు, మల్లేశ్, జంగ య్య, వెంకటయ్య, యాదయ్య, కృష్ణ, ప్రవీణ్, రవికుమార్, రా జు, వెంకటేశ్, అంజయ్య, నర్సింహులు పాల్గొన్నారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...