విద్యార్థులకు మార్గదర్శనం చేయాలి


Sat,September 8, 2018 11:52 PM

మేడ్చల్, నమస్తే తెలంగాణ : ఉపాధ్యాయులు విద్యార్థులకు కేవలం పుస్తక పరిజ్ఞాన అందించడమే కాదు, వారికి సరియైన మార్గదర్శనం అం దించాల్సిన గురుతర బాధ్యత కూడా ఉందని మ ండల విద్యాధికారి వసంతకుమారి పేర్కొన్నారు. మేడ్చల్ పట్టణ పరిధిలోని హైటెక్ స్కూల్‌లో శనివారం రికగ్నైజ్డ్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్ల ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులను మార్కుల సాధనే లక్ష్యంగా కాకుండా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. ప్రాథమిక స్థాయి నుంచే నైతిక విలువలతో కూడా బోధన అందజేయాలన్నారు. ప్రధానంగా కౌమారదశకు చేరుకునే ఉన్నత పాఠశాల విద్యార్థులకు తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయుల మార్గదర్శనం అవసరమన్నారు. శారీరకంగా, మానసికంగా చోటు చేసుకునే మార్పులతో విద్యార్థులు తప్పుదోవ ప ట్టకుండా సన్మార్గంలో నడిపించాలన్నారు. ఆ ద శలో మార్గదర్శనం లోపిస్తే విద్యార్థులు తప్పకుం డా భావి జీవితంలో రాణించలేరన్నారు. జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మంజులాప్రకాశ్, మండల అధ్యక్షుడు గిరిబాబు మాట్లాడుతూ.. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరాయ ంగా కృషి చేయాలన్నారు. తమకు తాము బాధ్యతగా వ్యవహరించాలన్నారు. తమ పిల్లలతో సమానంగా భావిస్తూ తరగతి గదిలోని ప్రతి విద్యార్థి బాగా చదవడానికి, సమాజంలో తనకంటూ స్థా నం సంపాదింకునేలా తీర్చిదిద్దాలన్నారు. తమ వి ద్యార్థి ఉన్నతంగా ఎదిగితే కలిగే సంతృప్తి ఎంత స ంపాదించినా రాదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి స్వామిదాస్, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారి రమేశ్, హరగోపాల్, పాండు, ఎంఆర్‌పీ రాజిరెడ్డి, వక్త శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...