సామూహిక సత్యనారాయణ వ్రతాలు


Sat,September 8, 2018 11:52 PM

కీసర : కీసర మండలం చీర్యాల్ శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ వ్రతాల వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం దేవస్థానం వారి సన్నిధానంలో స్వామివారి పల్లకీసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణ మహోత్సవం వేడుకలను నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో సుదర్శనహోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దేవస్థానం గర్భగుడిలో స్వామివారికి స్వర్ణపుష్పాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణగౌడ్, ఆలయ ధర్మకర్త శ్రీహరిగౌడ్‌లు పాల్గొన్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...