విక్రయానికి సిద్ధంగా వినాయక ప్రతిమలు


Sat,September 8, 2018 11:52 PM

ఘట్‌కేసర్ : మండల పరిధిలోని యాంనంపేట్ చౌరస్తా, జోడిమెట్ల, నారపల్లి ప్రాం తాల్లో వినాయకుల ప్రతిమలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. రాజస్థాన్ నుంచి విచ్చేసిన కార్మికులు వరంగల్ జాతీయ రహదారి వెంబడి పలు చోట్ల విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. అర ఫీట్ నుంచి 20 ఫీట్ల వరకు ఎత్తు కల్గిన పలు రకాల వినాయకుడి విగ్రహాలను తయారు చేసి విక్రయిస్తున్నారు. అతిచిన్న వినాయకుడి రూ.50 నుంచి 20 వేల వరకు ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 13న వినాయక చవితి పర్వదినం ఉండడంతో విక్రయానికి వేల కొద్ది విగ్రహాలు తయారు చేసి ఉంచినట్లు తెలిపారు. పలు ఆకృతుల్లో, పలు రంగులతో విగ్రహాలను రూపొందించినట్లు తయారీదారుడు రూపరామ్ తెలిపారు.

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...