సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం


Sat,September 8, 2018 11:52 PM

మేడ్చల్, నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పనులను వివరిస్తూ టీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతును కూడగట్టే విధంగా తమవంతు కృషి చేస్తామని కార్మిక తెలంగాణ రైతు (కేటీఆర్) సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రం లో అత్యధిక పథకాలు చేపట్టినందుకు గాను మేడ్చల్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి కేటీఆర్ సమితి సభ్యులు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ నాయకుడు కేటీఆర్‌ను ఆదర్శంగా తీసుకుని తాము టీఆర్‌ఎస్ గెలుపుకోసం పాటుపడుతామన్నారు. ఓట్ ఫర్ కార్.. సపోర్ట్ కే సీఆర్ నినాదంతో ముందుకు సాగుతామన్నారు. కార్యక్రమంలో సమితి మండల అధ్యక్షుడు ప్రేమ్‌దాస్, నాయకు లు రమేశ్, శ్రీనివాస్, ప్రవీణ్‌కుమార్, ఆంజనేయులు, ఫిరోజ్, ఈశ్వర్, మైపాల్‌రెడ్డి, నర్సింహ, సత్యనారాయణ, నవీన్, గణేశ్, మహేశ్, మాణిక్యమ్మ పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...