మాణిక్‌రావు సేవలు ఎనలేనివి


Sat,September 8, 2018 11:51 PM

తాండూరు టౌన్ : దివంగత మాజీ మంత్రి ఎం.మాణిక్‌రావు సేవలు ఎనలేనివని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం మాణిక్‌రావు రెండో వర్ధంతిని పురస్కరించుకొని తాండూరు పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయం చౌరస్తాలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం మేరకు తాండూరులో మాణిక్‌రావు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషమన్నారు. రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం క్లాసిక్ గార్డెన్‌లో నిర్వహించిన వర్ధంతి వేడుకల్లో మంత్రితో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, తాండూరు నియోజకవర్గంలోని ప్రజలు, అభిమానులు మాణిక్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మరో వైపు ఆర్యవైశ్య కల్యాణ మండపంలో కాంగ్రెస్‌కు చెందిన మరో వర్గం మాణిక్‌రావు వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాణిక్‌రావు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతాసంపత్, కాంగ్రెస్ నేతలు లకా్ష్మరెడ్డి, విశ్వనాథ్‌గౌడ్, డాక్టర్ సంపత్‌కుమార్, పి.నర్సింహులు, టీడీపీ ఇన్‌చార్జి రాజుగౌడ్, టీఆర్‌ఎస్ నేతలు కరుణం పురుషోత్తం రావు, అబ్దుల్ రావుఫ్ పాల్గొన్నారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...